యాంకర్ రష్మీ ( Anchor Rashmi ) పరిచయం అవసరం లేని పేరు.యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ సాధించిన రష్మీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.
స్వతగాహ యాంకర్ రష్మి జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే.ముఖ్యంగా వీధి కుక్కల( Street Dogs ) కు ఏమాత్రం హాని చేసిన ఇతర మూగజీవాలకు హాని తలపెట్టిన ఈమె వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తూ వాటికి హాని చేసిన వారికి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇవ్వడమే కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతూ ఉంటారు.

అయితే ఈ మధ్యకాలంలో వీధి కుక్కల దాడి అధికమైన విషయం మనకు తెలిసిందే.తెలంగాణలో వరుసగా వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేస్తూ చిన్నారులను చంపేస్తున్న ఘటనలు అందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.అయితే గురువారం సాయంత్రం ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్( Kazipet Railway Quarters ) సమీపంలో వీధి కుక్కల దాడి ఘటనలో మరో చిన్నారి మరణించారు.
అయితే దీని ప్రభావం ఇప్పుడు యాంకర్ రష్మిపై పడింది. ఈ విషయాన్ని యాంకర్ రష్మీకి ట్యాగ్ చేస్తూ దీనికి ఏం సమాధానం చెబుతారని రష్మిని నిలదీస్తున్నారు.

ఈ న్యూస్ చూశారా మేడం.మీరుజంతు ప్రేమకులు కాదనడం లేదు, నిత్యం కార్లలో బంగ్లాలో ఉండే మీకు ఏం తెలుస్తుంది.ఆ బాబు వాళ్ళ తండ్రి రోడ్డుపై ఇయర్ రింగ్స్ అమ్ముకుంటూ జీవితం గడుపుతారు.ఒక సినిమా పోతేనే మీరు తట్టుకోలేరు అలాంటిది కన్న కొడుకు మరణిస్తే వారి బాధ ఎలా ఉంటుందో మీకేం తెలుసు అంటూ పెద్ద ఎత్తున రశ్మిని ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
దయజేసి వాళ్లకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయండి అంటూ కామెంట్స్ చేయగా ఈ కామెంట్ల పై స్పందించిన రష్మీ తన స్టైల్ లో సమాధానం చెప్పారు.మీరు తప్పుగా నన్ను ట్యాగ్ చేశారు.
నేనేం ప్రభుత్వాన్ని కాదు డబ్బు మంజూరు చేయడానికి, ఈ విషయాలను నన్ను అడగడం వల్ల ఎలాంటి సహాయం రాదు.నిజానికి నేను చేయగలిగినంత కుక్కలకు క్రిమిరహితం చేయడానికి వ్యక్తిగత డబ్బుని ఉపయోగిస్తున్నా అంటూ రష్మీ రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







