దానివల్లే జీవితంలో మార్పు వచ్చింది... ఆమె నా బలగం.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబ (Nandamuri Family) పరువు ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని నేడు గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు.

 That's What Changed My Life She Is My Strength Ntr Details, Shalini, Birthday, N-TeluguStop.com

ఇలా నటుడిగా ఎప్పటికప్పుడు తనని నిరూపించుకుంటూ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన ఎన్టీఆర్ నేడు 40వ పుట్టినరోజు (Birthday) వేడుకలను జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు సెలబ్రిటీలు ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Telugu Nandamuri, Ntr Mother, Ntr, Ntr Latest, Shalini-Movie

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన సినీ కెరియర్లో,వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే గతంలో ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని చేసిన కామెంట్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ హైదరాబాదులోనే పుట్టి పెరిగారు.చిన్నప్పటినుంచి ఎన్టీఆర్ చాలా అల్లరి చేసేవాడని అలా అల్లరి చేయటం వల్ల తన తల్లి చేతిలో బాగా దెబ్బలు తినే వాడినని ఎన్టీఆర్ తెలిపారు.తన అల్లరిని భరించలేని తన అమ్మ తనని బాగా కొట్టేదని చిన్నప్పటి జ్ఞాపకాలను ఈయన గుర్తు చేసుకున్నారు.

Telugu Nandamuri, Ntr Mother, Ntr, Ntr Latest, Shalini-Movie

చిన్నప్పటి నుంచి అమ్మకు నేనంటే ఎంతో ప్రాణం అలాగని తనని గారాబం చేసేది కాదని వాస్తవంలో బతకడం నేర్పించిందని ఎన్టీఆర్ తెలియజేశారు.అమ్మే నా బలగం అంటూ ఎన్టీఆర్ తన తల్లి(NTR Mother Shalini) గొప్పదనం గురించి కూడా తెలియజేశారు.ఇక ఎన్టీఆర్ సినీ కెరియర్ లో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే.2009 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాని(Road Accident) కి గురైన విషయం మనకు తెలిసిందే.ఆ ప్రమాదమే తన జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చిందని అందుకే ప్రయాణ సమయంలో తాను ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటానని గత ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube