సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమాను ప్రకటించి పూర్తి చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వీరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.
రెండింటిలో కూడా మహేష్ డిఫరెంట్ గా కనిపించి ఫ్యాన్స్ ను ఆకట్టు కున్నాడు.అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాక దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమా రాబోతుంది.
అందుకే ఈ సినిమాపై ఫ్యాన్స్ లో క్రేజ్ పీక్స్ లో ఉంది.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్.

ఇక త్వరలోనే మరో అప్డేట్ రాబోతుంది.సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున అంటే మే 31న ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.ఈ గ్లింప్స్ లో మహేష్ లుంగీతో మాస్ లుక్ లో ఆదరిపోతాడట.ఈ లుక్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తుందని తెలుస్తుంది.మరి ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ అప్డేట్ ఏ రేంజ్ లో కిక్ ఇస్తుందో చూడాలి.

కాగా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నాడు.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.







