తెలంగాణ బిజెపిలో అన్నీ తానే వ్యవహరిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay )కు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనట్టుగానే కనిపిస్తున్నాయి.ఆయనపై సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారు.
బండి సంజయ్ ను తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా తప్పించాలని, ఆయన స్థానంలో ఈటెల రాజేందర్( Etela Rajender ) ను నియమించాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.పార్టీలో అన్ని తానే సంజయ్ వ్యవహరిస్తున్నారని, మరో లీడర్ ను ఎదగనివ్వడం లేదని, ఇటీవల కాలంలో పార్టీలో చేరిన నాయకులకు, వారి అనుచరులకు పెద్దగా ప్రాధాన్యం దక్కకుండా చేస్తూ సంజయ్ వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి.
బండి సంజయ్ సారధ్యంలో బిజెపి తెలంగాణలో బలోపేతం కాలేదని, ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పదేపదే హై కమాండ్ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ( BJP )రాజకీయం ఢిల్లీకి చేరింది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ , జితేందర్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి ,ఈటెల రాజేందర్ తో పాటు, మరికొంతమంది కీలక నాయకులు ఢిల్లీలోనే మకాం వేశారు.వీరితో పాటు, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను అధిష్టానం పెద్దలు పిలిచారు.
దీంతో ఏం జరగబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతుంది.తెలంగాణలో గతంతో పోలిస్తే పార్టీ బాగా బలోపేతం అయిందని సంబర పడుతున్నా, ఆ పార్టీలోనూ గ్రూపు రాజకీయాలు తెరపైకి రావడం, నాయకులు మధ్య సమన్వయం లేకపోవడం వంటివన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన కీలక నాయకులందరినీ మళ్లీ వెనక్కి రావాలని, కాంగ్రెస్ లో మంచి ప్రాధాన్యం ఇస్తామనే సెంటిమెంట్ తో కూడిన విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదే సమయంలో తెలంగాణ బిజెపిలో గందరగోళం నెలకొనడం వంటివి కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకునే పనులు పడింది.
ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా తప్పించి ఆయన స్థానంలో ఈటల రాజేందర్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న గాని, ఇప్పుడు ఇక్కడి రాజకీయం ఢిల్లీకి చేరడంతో ఎప్పుడు ఏ నిర్ణయం వెలవడుతుందనే టెన్షన్ తెలంగాణ బిజెపి నాయకుల్లో, సంజయ్ వర్గీయుల్లో నెలకొంది.సార్వత్రిక ఎన్నికలకు సమయం కొద్ది నెలలు మాత్రమే ఉండగా ఈ తరహా వ్యవహారాల బీజేపీ కి ఇబ్బందులు తెచ్చిపెట్టేవే.