2000 నోట్ల రద్దు ప్రభావం ఎంత ?

డిమానిటైజేషన్తో ఇంతకు ముందే ఒకసారి దేశానికి షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం మరొకసారి అలాంటి నిర్ణయం తీసుకుంది.2000 రూపాయల నోటును చెలామణి నుండి ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించి సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది .అదికూడా రోజుకు 20 వేల రూపాయల గరిష్ట పరిమితి తో మాత్రమే ….ఇది దేశంలో కొన్ని వర్గాల ప్రజలను ఆందోళన గురి చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

 2000 Note Ban Will Effect Indian Economy, 2000 Note Ban, Indian Economy , Centr-TeluguStop.com

డిమానిటైజేషన్( Demonetization ) నాటి పరిస్థితులు మరోసారి పునరావృతం అవుతాయా అంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

Telugu Ban, Central, Indian Economy, Narendra Modi-Telugu Political News

దీనిపై ఆర్థిక రంగం నిపుణులుకూడా మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు .ప్రణాళిక సంఘం మాజీ అధ్యక్షుడు కుటుంబరావు నల్లధనం కట్టడికి ,నగదరాహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఇలాంటి చర్యలు అవసరమని ,ప్రభుత్వం( Central government ) ఇలాంటి చర్య తీసుకుంటుందని మార్చి లోనే ఆశించామని ఆయన ప్రకటించారు.అయితే మరి కొంతమంది దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు.

గతంలో డిమానిటైజేషన్ చేసినప్పుడే నల్లధనం కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి 20000 నోటును రద్దు చేయడానికి కారణాలు ఏమిటో ప్రజలకు బహిరంగంగా వివరించాలని అంటున్నారు .ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుందని ,ఒకే ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు నోట్లను మరోసారి రద్దు చేయడం అంటే డిమానిటైజేషన్ ఫెయిల్ అయినట్లు అర్థం కాదా ? అంటూ కొంత మంది వాఖ్యనిస్తున్నారు .

Telugu Ban, Central, Indian Economy, Narendra Modi-Telugu Political News

ఇలా ఆస్తమానం నోట రద్దు చేస్తూ ఉంటే ఆర్బిఐ మీద నమ్మకం ప్రజలు కోల్పోతారన్నది వీరి వాదన గా ఉంది .అయితే దీనిపై ఆర్బిఐ( RBI ) వివరణ మరోరకంగా ఉంది లీగల్గా టెండర్ ఉన్న ఏ నోటు జీవితకాలమైనా ఐదు నుంచి ఆరేళ్లకు మించి మన్నికగా ఉండదని.2000 నోటు తీసుకువచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్నట్లుగా ఆర్బిఐ తరపు ప్రతినిధులు చెబుతున్నారు.సెప్టెంబర్ 30వ తారీకు వరకు ఈ నోట్లు చలామణి లో ఉంటాయి కాబట్టి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రోజుకి 20వేల గరిష్ట పరిమితుతో ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు కనుక ఆర్థిక వ్యవస్థపై ఇది ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube