2000 నోట్ల రద్దు ప్రభావం ఎంత ?
TeluguStop.com
డిమానిటైజేషన్తో ఇంతకు ముందే ఒకసారి దేశానికి షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం మరొకసారి అలాంటి నిర్ణయం తీసుకుంది.
2000 రూపాయల నోటును చెలామణి నుండి ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించి సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది .
అదికూడా రోజుకు 20 వేల రూపాయల గరిష్ట పరిమితి తో మాత్రమే .
ఇది దేశంలో కొన్ని వర్గాల ప్రజలను ఆందోళన గురి చేస్తున్నట్లుగా తెలుస్తుంది.డిమానిటైజేషన్( Demonetization ) నాటి పరిస్థితులు మరోసారి పునరావృతం అవుతాయా అంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
"""/" / దీనిపై ఆర్థిక రంగం నిపుణులుకూడా మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు .
ప్రణాళిక సంఘం మాజీ అధ్యక్షుడు కుటుంబరావు నల్లధనం కట్టడికి ,నగదరాహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఇలాంటి చర్యలు అవసరమని ,ప్రభుత్వం( Central Government ) ఇలాంటి చర్య తీసుకుంటుందని మార్చి లోనే ఆశించామని ఆయన ప్రకటించారు.
అయితే మరి కొంతమంది దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు.గతంలో డిమానిటైజేషన్ చేసినప్పుడే నల్లధనం కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి 20000 నోటును రద్దు చేయడానికి కారణాలు ఏమిటో ప్రజలకు బహిరంగంగా వివరించాలని అంటున్నారు .
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుందని ,ఒకే ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు నోట్లను మరోసారి రద్దు చేయడం అంటే డిమానిటైజేషన్ ఫెయిల్ అయినట్లు అర్థం కాదా ? అంటూ కొంత మంది వాఖ్యనిస్తున్నారు .
"""/" / ఇలా ఆస్తమానం నోట రద్దు చేస్తూ ఉంటే ఆర్బిఐ మీద నమ్మకం ప్రజలు కోల్పోతారన్నది వీరి వాదన గా ఉంది .
అయితే దీనిపై ఆర్బిఐ( RBI ) వివరణ మరోరకంగా ఉంది లీగల్గా టెండర్ ఉన్న ఏ నోటు జీవితకాలమైనా ఐదు నుంచి ఆరేళ్లకు మించి మన్నికగా ఉండదని.
2000 నోటు తీసుకువచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్నట్లుగా ఆర్బిఐ తరపు ప్రతినిధులు చెబుతున్నారు.
సెప్టెంబర్ 30వ తారీకు వరకు ఈ నోట్లు చలామణి లో ఉంటాయి కాబట్టి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రోజుకి 20వేల గరిష్ట పరిమితుతో ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు కనుక ఆర్థిక వ్యవస్థపై ఇది ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ మూవీ మరో రివ్యూ వైరల్.. ఈ సినిమా హైలెట్ సన్నివేశాలు ఇవే!