బీఆర్ఎస్( BRS ) జాతీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలలో విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా సీఎం కేసీఆర్( CM KCR ) ఎక్కువగా మహారాష్ట్ర పై( Maharashtra ) ఫోకస్ పెట్టడం జరిగింది.
ఆ రాష్ట్రం నుండే బీఆర్ఎస్ పార్టీలో చాలామంది జాయిన్ కావడం జరిగింది.ఈ క్రమంలో కేసీఆర్ పార్టీని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలు భారీగానే సత్ఫలితాలను తీసుకొస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మహారాష్ట్ర గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేసుకోవడం జరిగింది.

మహారాష్ట్ర అంబే లోహల్ గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన పటాన్ 115 ఓట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది.ఈ విజయంతో మహారాష్ట్రకి చెందిన బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే నేడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించడం జరిగింది.నాందేడ్ జిల్లా పార్టీ శిక్షణా తరగతులకు హాజరై అక్కడ నాయకులతో సమావేశమయ్యారు.ఈ శిక్షణా తరగతులలో పార్టీని మహారాష్ట్రలో ఏ విధంగా విస్తరించాలి ముందుకు తీసుకెళ్లాలి.? ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలి అనేది… కేసీఆర్.మహారాష్ట్ర పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.







