ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్( Whatsapp ) ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.కాబట్టి వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది.
అంతే కాకుండా వినియోగదారుల అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తెస్తూనే ఉంది.ప్రస్తుతం వాట్సాప్ లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
ఈ ఆప్షన్ వల్ల ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం.
మామూలుగా వాట్సాప్ లో మెసేజ్ పంపించిన తర్వాత ఏవైనా తప్పులు ఉంటే వెంటనే “డిలీట్ ఫర్ ఎవ్రీ వన్” ( Delete For Everyone ) అనే ఆప్షన్ తో మెసేజ్ ని డిలీట్ చేసేస్తాం.
మళ్లీ కొత్తగా మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసేస్తాం.ఈ సమస్యకు పరిష్కారంగా ఎడిట్ ఆప్షన్( Whatsapp Edit ) అందుబాటులోకి వచ్చింది.మనం పంపించిన మెసేజ్ లో ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

ఒక వారం క్రితమే ఈ ఎడిట్ ఆప్షన్ ను iOS, Android బీటా లలో విడుదల చేసింది.ఇక త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.10.13, iOS వెర్షన్ 23.10.0.70 లలో ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది.ఈ ఎడిట్ ఆప్షన్ ను అవతల వ్యక్తులకు మెసేజ్ పంపిన 15 నిమిషాల వ్యవధిలో ఎన్నిసార్లైనా ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది.

ఈ ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవాలి అనుకుంటే ముందుగా ఏ మెసేజ్ ను ఎడిట్ చేయాలో ఆ మెసేజ్ పై క్లిక్ చేసిన తర్వాత కొద్ది సేపు హోల్డ్ చేయాలి.అప్పుడు అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.మెసేజ్ ఎడిట్ చేసిన తర్వాత అవతల వ్యక్తులకు సెండ్ చేస్తే.
పూతల వ్యక్తులకి ఎడిటెడ్ మెసేజ్ అని చూపిస్తుంది.ఈ ఎడిట్ ఆప్షన్ వాట్సాప్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వాట్సప్ తెలిపింది.







