పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన తాజా చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి .టీజర్ తో విమానార్స్లు ఎదుర్కొన్న ఈ చిత్రం .
ట్రైలర్ తో అంచనాలు పెంచుకుంది .ఇక ఈ సినిమా కోసం .వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రభాస్ అభిమానులతో పాటు .సాధారణ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చుస్తునారు .ప్రభాస్.రాముడిగా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి .

అయితే ఏ సినిమాకైనా విజువల్స్ వీక్షిస్తూ డబ్బింగ్ థియేటర్ లో డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులకు సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఛాన్స్ ఉంటుందనడంలో సందేహం లేదు.దర్శకుడు – ఎడిటర్ – కెమెరామేన్ లు చూసినా… వారు ఆ సినిమాతో అప్పటివరకూ ట్రావెల్ చేసి ఉంటారు కాబట్టి జడ్జిమెంట్ పై స్పష్టత ఉండకపోవచ్చు.ఈ క్రమంలో.
ఆదిపురుష్( Aadipurush ) సినిమాలో ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పిన శరద్ కేల్కర్( Sharad kelkar )… తాజాగా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.బాహుబలి హిందీ వెర్షన్ లో ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పిన నటుడు శరద్ కేల్కర్ అప్పట్లో మంచి మార్కులే కొట్టేశాడు.
ప్రభాస్ కు అతడి గంభీరమైన గొంతు కరెక్ట్ గా సెట్ అయ్యింది.ఇదే క్రమంలో ఆదిపురుష్ లో ప్రభాస్ పాత్ర రాఘవకు కూడా శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పాడు.అయితే తాజాగా ఆదిపురుష్ డబ్బింగ్ సమయంలో చూసిన సన్నివేశాలపై స్పందించిన శరద్…

సినిమా కంటెంట్ ప్రెజెంటేషన్ కానీ.ఆలోచనా ప్రక్రియ కానీ అద్భుతంగా ఉన్నాయి అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు .సినిమా అంతా ఈయన చూడకపోయినా… ప్రభాస్ సీన్స్ అన్నీ చూస్తూ డబ్బింగ్ చెప్పిన అనుభవంతో చెబుతున్నాడు కాబట్టి… కచ్చితంగా నిజమే అయ్యి ఉంటుందని ఖుషీ అవుతున్నారని తెలుస్తుంది.ఇక, జూన్ 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది .ఆ రోజు ఈ సినిమా ఫలితం ఏంటి అనేది తేలిపోతుంది .అయితే ఈ సినిమాపై ప్రస్తుతం పాజిటివ్ బజ్ నెలకొని ఉంది .ఈ సినిమా 2000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమన్న టాక్ కూడా వినిపిస్తుంది…








