సౌందర్య.( Soundarya ) తన నటన తో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసి కానని తీరాలకు వెళ్ళిపోయి రెండు దశాబ్దాలు గడిచిన కూడా ఇంకా అభిమానులు ఆమె గురించి ఎదో ఒక సమయంలో గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
కడుపు లో మూడు నెలల బిడ్డ తో సహా ఆమె హెలికాఫ్టర్ ప్రమాదం లో కన్ను మూసింది.ఆమె మరణించిన తీరు ప్రతి ఒక్కరిని కలిచి వేసింది.
అస్సలు ఆమె శరీరం కాలి ముద్దాయి ఆ బాడీ ఆమెది అవునో కాదో కూడా తెలియని దయనీయ స్థితిలో సౌందర్య కన్ను మూసింది.
ఆమెతో పాటు సౌందర్య అన్న అమర్( Amar ) కూడా చనిపోయారు.
ఒకేసారి ఇద్దరు కన్న పిల్లలను కోల్పోయిన సౌందర్య తల్లి( Soundarya Mother ) చాలా రోజుల పాటు డిప్రెషన్ కి వెళ్లిపోయారు.చాల రోజుల పాటు మీడియా ముందుకు రావడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు.
ఇటీవల కాలంలో ఆమె పలు మీడియా సంస్థలకు ఇంటర్వూస్ ఇస్తున్నారు.ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు గాను సమాధానం ఇస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
తనకు ప్రతి రోజు సౌందర్య కలలోకి వస్తుంది అని, నా మనసు బాగోలేని రోజు నా పిల్లలు ఇద్దరు కలలోకి వస్తారని, సౌందర్య అయితే నీకెందుకు మమ్మీ నేను ఉన్నాను కదా అని చెప్తుంది అని, కానీ ఆ కల మధ్యలోనే ఎందుకో ఆగిపోతుందని ఎమోషనల్ అవుతూ తెలిపారు.నేను కాసేపు సౌందర్య కి కనిపించక పోతే అమ్మ ఎక్కడ ఉన్నావ్ అని ఎప్పుడు చుట్టూ తిరుగుతూ ఉండేదని, ఆమె ఎక్కడికైనా వెళితే తనకు కూడా నిముషం కూడా తోచేది కాదని సౌందర్య తల్లి తెలుపుతున్నారు.
నాకు ఇప్పటికి సౌందర్య ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటుంన్నట్టే ఉంటుంది అని కన్నీళ్లతో చెప్పారు.కన్నడ బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన సౌదర్యం తల్లి దండ్రులు మంజుల మరియు సత్యనారాయణ. 27 ఏళ్ళ వయసులో 2004 లో ఆమె కన్ను మూసారు.ఇప్పటికే మంజుల ( Manjula ) ఒంటరిగానే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.సౌందర్య భర్త మరొక వివాహం చేసుకున్నప్పటికీ ఆమె తల్లి అతడిని తన సొంత కొడుకు కన్న కూడా ఎక్కువ అంటూ పలుమార్లు చెప్పడం విశేషం.