ఈ మధ్య భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో స్టార్స్ నటిస్తున్నారు.ముఖ్యంగా ఇది వరకు బాలీవుడ్ నటులు మన సినిమాల్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపించే వారు కాదు.
కానీ ఇప్పుడు అక్కడి స్టార్స్ ఇక్కడి సినిమాల్లో కూడా నటించడానికి ఓకే చెబుతున్నారు.మరి ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్( Sanjay Dutt ) కూడా ఈ మధ్య వరుసగా సౌత్ సినిమాలు చేస్తున్నాడు.

ఏదైనా స్టార్ హీరో సినిమా అయితే ఈయన ఉండాల్సిందే అనేలా పాపులర్ అవుతున్నాడు.మరి సంజయ్ దత్ నటిస్తున్న సినిమాల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి( Thalapathy Vijay ) చేస్తున్న సినిమా కూడా ఉంది.ఈయన చేస్తున్న లియో సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ తండ్రిగా ఒక గ్యాంగ్ స్టర్ గా ఈయనను చూపించ బోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ సినిమాపై తమిళ్ లో ఇప్పుడే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.
మరి ఈ సినిమాలో నటిస్తున్న సంజయ్ దత్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాలో నటిస్తున్న సంజయ్ దత్ కు ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

హీరోకు సమానంగా ఉండే ఈయన పాత్ర కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు టాక్.ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.అలాగే లోకనాయకుడు కమల్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నట్టు తెలుస్తుంది.







