రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ ఏరియా ఆసుపత్రి లో ఒకే రోజు 10 డెలివరీలు చేశారు.అందులో ఆరు సాధారణ కాన్పులు, నాలుగు ఆపరేషన్ చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా మెడికల్ సూపరిండెంట్ మాట్లాడుతూ డెలివరీలో పాల్గొన్న డాక్టర్లను, సిబ్బందిని అభినందించారు.అలాగే మొదటి కాన్పులో నార్మల్ డెలివరీ అయి ఆడబిడ్డ జన్మిస్తే వాళ్లకు ఉయ్యాల ఇస్తున్నామని తెలియజేశారు.
వేములవాడ(Vemulawada ), చుట్టుపక్కల మండలాల ప్రజలు ఏరియా ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో మెడికల్ సూపరిండెంట్ రేగులపాటి మహేష్ రావు( Regulapati Mahesh Rao ), డాక్టర్ చైతన్య సుధా, సంతోష్ చారి, జ్యోతి, హెడ్ నర్స్ స్టెల్లా, స్టాఫ్ నర్స్ భాగ్యలక్ష్మి, లక్ష్మీ దేవరకొండ, అరుణ్ సాయి, జ్యోతి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.







