యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young tiger NTR ) బర్త్ డే కోసం ఎదురు చూడని అభిమానులు లేరు.ఎందుకంటే తారక్ బర్త్ డే( Birthday ) రోజు కొత్త సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వస్తుంది అని ఫ్యాన్స్ ఆశ పడుతుంటారు.
మరి ఈసారి కూడా తారక్ నటిస్తున్న కొత్త సినిమా నుండి బర్త్ డే బ్లాస్ట్ ఉందని కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే దీనిని నిజం చేస్తూ తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఎన్టీఆర్ మే 20న తన పుట్టిన రోజును జరుపుకో నున్నారు అనే విషయం తెలిసిందే.మరి రేపే ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.ఈ ఎగ్జైటింగ్ ను మరింత పెంచుతూ ఒక రోజు ముందుగానే తారక్ ఫ్యాన్స్ కోసం ట్రీట్ రెడీ చేసారు మేకర్స్.ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala siva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”NTR30”.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి ఈ రోజు సాలిడ్ అప్డేట్ రాబోతుంది.ఈ రోజు రాత్రి 7 గంటల 2 నిముషాలకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా అదిరిపోయే మోషన్ పోస్టర్ తో అనౌన్స్ మెంట్ చేయగా ఈ పోస్టర్ తోనే సాలిడ్ బజ్ పెరిగి పోయింది.
చూడాలి వేరే లెవల్లో ప్లాన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ ఎలా ఆకట్టు కుంటుందో.
ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి అడుగు పెట్టబోతోంది.అలాగే విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు.
అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.