ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు.
వైసీపీ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జిషీట్ కార్యక్రమం చేపట్టారని తెలిపారు.
ప్రతి చోటా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి తమ ఆవేదన చెప్పారని సోమువీర్రాజు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే 20,107 మంది ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారని వెల్లడించారు.ఛార్జీషీట్ సమావేశాల సమూహాన్ని పుస్తకరూపంలో తెస్తామన్నారు.20 లక్షల ఇళ్లు నిర్మించాలని కేంద్రం నిధులు ఇస్తే దారి మళ్లించారని విమర్శించారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పేరు మార్చుకున్నారని ఆరోపించారు.







