2016 సంవత్సరంలో విడుదలైన బిచ్చగాడు( Bichagadu ) మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.తమిళంతో పోల్చి చూస్తే తెలుగులోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాకు సీక్వెల్ కాకపోయినా బిచ్చగాడు2( Bichagadu2 movie ) టైటిల్ తో తెరకెక్కిన ఒక సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది.అయితే బిచ్చగాడు2 సినిమా బిచ్చగాడు స్థాయిలో లేకపోవడం గమనార్హం.
బిచ్చగాడు మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో విజయ్ ఆంటోని( Vijay antony ) ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సినిమాలో మొదటి 20 నిమిషాలు అద్భుతంగా ఉండగా తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం ఆశించిన విధంగా లేవు.బిచ్చగాడు2 యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోగా కమర్షియల్ గా ఈ సినిమా రేంజ్ ఏంటో తెలియాల్సి ఉంది.బిచ్చగాడు క్రేజ్ ను వాడుకోవాలని చూడటమే ఈ సినిమాకు మైనస్ అయిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
బిచ్చగాడు ఫస్ట్ పార్ట్ స్థాయిలో మాత్రం అంచనాలను ఈ సినిమా అంచనాలను అందుకోలేదు.

బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తే డబ్బింగ్ సినిమాను చూసిన భావన కలుగుతుంది.విజయ్ ఆంటోని నిరుత్సాహపరిచిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.విజయ్ ఆంటోని నటన, బీజీఎం, సినిమాలోని ఫస్టాఫ్ లోని మొదటి 20 నిమిషాలు బిచ్చగాడు2 సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు.
బిచ్చగాడు2 సినిమాలోని ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఏ మాత్రం ఆసక్తికరంగా లేని కథనం, హీరోయిన్, కొన్ని రొటీన్ సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.బిచ్చగాడు సినిమాను మైండ్ లో పెట్టుకోకుండా చూస్తే మాత్రం బిచ్చగాడు2 నచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.బిచ్చగాడు2 మూవీ కమర్షియల్ గా అయినా సక్సెస్ సాధిస్తే బాగుంటుందని ఈ సినిమా అభిమానులు కోరుకుంటున్నారు.







