తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా ఒక బ్యాడ్ సెంటిమెంట్ నడుస్తున్న విషయం తెలిసిందే.టాలీవుడ్ హీరోలను ఒక బ్యాడ్ సెంటిమెంట్ బాగా డిస్టర్బ్ చేస్తోంది.
దీంతో టాలీవుడ్ లో చాలామంది హీరోలు తలలు పట్టుకుంటున్నారు.అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని టాలీవుడ్ హీరోలు అయినా రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్చేయాలని చూస్తున్నారట.
అసలు ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి? అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ కి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.
( Ram charan )ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమిళ దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు తీస్తే అవి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడం గ్యారెంటీ అన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

20 ఏళ్ల కిందట విడుదలైన నాని సినిమా నుంచి నేడు విడుదల అయిన కస్టడీ సినిమా వరకు తమిళ దర్శకుడు తెరకెక్కించిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ బోల్తా కొట్టాయి.ఒకప్పుడు తమిళ దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిన్నప్పటికీ కానీ గత 15 ఏళ్లుగా అయితే కాదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా తర్వాత ఇప్పటివరకు తమిళ దర్శకులు తెరకెక్కించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మొన్నటికి మొన్న లింగుస్వామి రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ది వారియర్, నాగచైతన్య వెంకట ప్రభు కాంబినేషన్ లో వచ్చిన కస్టడీ( Custody ) సినిమా ఇలా తమిళ దర్శకులు తెరకెక్కించిన ప్రతి ఒక్క సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.

దీంతో తమ్ముడు దర్శకులకు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదు అని తెలుగు హీరోలు అందరూ ఫిక్స్ అయిపోయారు.అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్ మార్చే అవకాశం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చరణ్ చేతుల్లో ఉంది.ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు.
సముద్రఖనితో వినోదయ సీతం రీమేక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్, మరోవైపు రామ్ చరణ్ కూడా దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్( Game Changer ) సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు కూడా బలమైన కంటెంట్ తో భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.
అయితే ఈ సినిమాల దెబ్బకు ఇప్పటివరకు ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ మొత్తం పటాపంచలవుతుందని మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అది జరుగుతుందో చూడాలి మరి.







