తెలుగు సినీ ప్రేక్షకులకు పుష్ప సినిమా( Pushpa ) గురించి పుష్ప సినిమాలో నటించిన నటినటుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పుష్ప సినిమాతో ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.
పుష్ప సినిమా ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రాజ్ తిరందాసు( Raj Tirandasu ) కూడా ఒకరు.మొదటి కొత్త పోరడు అనే వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
కాగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రాజ్. పుష్ప సినిమాలో అనసూయకు తమ్ముడిగా సునీల్ కు బామ్మర్దిగా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పారుచుకున్నాడు.పుష్ప సినిమా తర్వాత రాజ్ తిరందాసు కి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.త్వరలోనే చాంగురే బంగారు రాజా, సత్తి గాని రెండెకరాలు లాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్ తిరందాసు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా రాజ్ తిరందాసు మాట్లాడుతూ.మాది నల్గొండ జిల్లాలోని గుర్రంపోడుకు దగ్గర్లో ఒక చిన్నగ్రామం.
మాది మిడిల్ క్లాస్ చేనేత కుటుంబం.పది వరకు స్థానికంగా ఉండే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాను.

కుటుంబానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉండేవి.డిగ్రీ చదువుకోసం హైదరాబాద్‌కు పారిపోయి వచ్చాను.బస్టాండులో పడుకున్నాను.ఆర్టీసీ బస్సుల్లో తిరిగి చదువు పూర్తి చేశాను.ఆ సమయంలో నాకు స్నేహితులు చాలా సపోర్ట్ చేశారు.ఆ తర్వాత బెంగళూరు వెళ్లి సాఫ్ట్ వేర్ కోర్సు చేసి అదే రంగంలో జాబ్ సంపాదించాను.
బాంబేలో జాబ్ చేస్తూనే అవకాశాల కోసం ప్రయత్నించేవాడిని.ఇంట్లో తెలియకుండా చాలా ట్రై చేశాను.
ఛాన్స్‌ల కోసం తిరిగే టైమ్‌లో చాలా అవమానాలు ఎదుర్కున్నాను.చాలా బాధ అనిపించేది.
ఇక ఇదంతా వర్కవుట్ అవ్వదని అనిపించి మంచి జీతం వచ్చే జాబ్ వదిలేసి హైదరాబాద్ వచ్చాను.

ఆ సమయంలోనే ఆహా ఓటీటీ కోసం అన్వేష్ డైరెక్ట్ చేసిన కొత్త పోరడు వెబ్ సీరిస్ లో( Kotha Poradu Web Series ) అవకాశం వచ్చింది.తొలి అవకాశం కావడంతో ఫుల్ ఎగ్జైట్ అయ్యాను.అందులో నన్ను నేను ఆవిష్కరించుకున్నాను ఆ వెబ్ సిరీస్ నాలో ఆత్మవిశ్వాసం నింపింది.
కొత్త పోరడు వెబ్ సీరిస్ లో నా క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇండస్ట్రీలో నాకంటూ గుర్తింపు వచ్చింది.ఆ తర్వాతనే డైరెక్టర్ సుకుమార్ టీమ్ నుంచి కాల్ వచ్చింది.నా ఆడిషన్ చూసి ఆయనే స్వయంగా అప్రిషియేట్ చేశారు.
పుష్ప సినిమాలో అవకాశం ఇచ్చారు.అల్లు అర్జున్ లాంటి స్టార్ సినిమాలో నేను చేస్తున్నానని తెలిసినప్పుడు చాలా ఆనందం వేసింది.
ఆ తర్వాత పుష్ప రిలీజ్ అయ్యాకు ఎంతోమంది అభినందించారు అని చెప్పుకొచ్చారు.







