ప్రతి స్టార్ హీరోయిన్ కు తను నటించిన హీరోలలో కొంతమంది హీరోలు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.ఆ అభిమానం వల్ల హీరోయిన్లు ఆ హీరోల కోసం కొన్నిసార్లు కెరీర్ ను రిస్క్ లో పెట్టడానికి కూడా ఇష్టపడతారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కోసం కాజల్ కూడా అలాంటి త్యాగం చేశారు.సాధారణంగా కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ లో చెయ్యడానికి అస్సలు ఆసక్తి చూపరు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానంతో జనతా గ్యారేజ్ ( Janata Garage )సినిమాలోని పక్కా లోకల్ సాంగ్ లో కాజల్ అదిరిపోయే స్టెప్పులు వేశారు.ఈ సినిమాకు ముందు తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) మాత్రం ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగింది.
ఎన్టీఆర్ కోసం కెరీర్ ను రిస్క్ లో పెట్టి కాజల్ స్పెషల్ సాంగ్ చేయడం ఫ్యాన్స్ కు సైతం సంతోషాన్ని కలిగించింది.

ఎన్టీఆర్ కాజల్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.బృందావనం, బాద్ షా, టెంపర్ సినిమాలలో కాజల్ నటించగా జనతా గ్యారేజ్ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేశారు.
ఈ నాలుగు సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.ఎన్టీఆర్ కాజల్ కాంబో రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కాజల్ ప్రస్తుతం రీఎంట్రీలో బాలకృష్ణకు( Balakrishna ) జోడీగా ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగులో తనకు పూర్వ వైభవం వస్తుందని ఆమె నమ్ముతున్నారు.కాజల్ అగర్వాల్ వయస్సు 37 సంవత్సరాలు కాగా పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ కు సినిమా ఆఫర్లు తగ్గుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.







