KTR : తెలంగాణకు హాలీవుడ్ నిర్మాణ సంస్థను ఆహ్వానించిన కేటీఆర్?

తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది తర్వాత అతి తక్కువ సమయంలోనే అన్ని రంగాల్లోనూ సక్సెస్ ను సాధిస్తూ దూసుకుపోతోంది.దేశానికి ఆదర్శవంతంగా తయారయ్యింది.

 Warner Bros Discovery To Set Up Idc In Hyderabad-TeluguStop.com

దాంతో హైదరాబాద్ నగరానికి ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి.తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహమిస్తూ సినిమా రంగం అభివృద్ధికి పాటుపడుతోంది.

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్( Minister KTR ) అమెరికా పర్యటనలో భాగంగా ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థను తెలంగాణకు ఆహ్వానించారు.

Telugu Discovery, Hollywood, Bros-Movie

తెలంగాణ నగరానికి అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజ సంస్థ రానున్నది.వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ( Warner Bros.Discovery ) హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది.

కాగా ఐడిసి ఏర్పాటుతో దాదాపు 1,200 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి.వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ మీడియా రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌తో వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ ఆర్థిక విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలెగ్జాండ్రా కార్టర్‌( Vice President Alexandra Carter ) తో సమావేశం అయ్యి హైదరాబాద్ లో మీడియా రంగం గురించి ఇక్కడ పెట్టుబడుల గురించి చర్చించారు.

Telugu Discovery, Hollywood, Bros-Movie

మీడియా రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు కార్టర్‌ తెలిపారు.అలాగే త్వరలోనే హైదరాబాద్‌లో ఐడీసీని ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు.ఈ కేంద్రం ద్వారా ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

వార్నర్‌ బ్రోస్‌ డిస్కవరీ సంస్థకు హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్‌, సీఎన్‌ఎన్‌, టీసీఎల్‌, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్‌, డబ్ల్యూబీ, యూరోస్పోర్ట్‌, యానిమల్‌ ప్లానెట్‌, కార్టూన్‌ నెట్‌వర్క్‌.మొదలైన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెలివిజన్‌ ఛానల్స్ ఉన్నాయి.

వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ కేంద్రం ఏర్పాటు నిర్ణయంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube