సాధారణంగా ఏ సినిమా అయినా ఒకటి లేదా రెండుసార్లు రీ రిలీజ్ కావడం జరుగుతుంది.మరీ బ్లాక్ బస్టర్ మూవీ అయితే మూడుసార్లు రీ రిలీజ్ చేస్తారు.
ప్రస్తుతం పాత సినిమాలను కొత్త టెక్నాలజీతో రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఒక సినిమా మాత్రం ఒకటి కాదు.
రెండు కాదు.ఏకంగా 550సార్లు రీరిలీజ్ అయైంది.
ఒక కన్నడ మూవీ ఈ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.
శివరాజ్ కుమార్( Shivraj Kumar ) నటించిన ఓం సినిమా( Om movie ) ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.1995 సంవత్సరం మే నెల 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.ఎక్కువసార్లు రీరిలీజ్ అయిన సినిమాగా ఈ సినిమా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ( Limca Book of Records )తో స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఉపేంద్ర( Upendra ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రేమ( Prema ) హీరోయిన్ గా నటించారు.ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఉపేంద్ర కాలేజ్ లో చదువుకునే సమయంలో ఈ మూవీ కథను రాసుకున్నారు.అయితే ఈ సినిమా కథకు శివ సినిమాకు కొన్ని దగ్గర పోలికలు ఉండటంతో కథలో కొన్ని మార్పులు చేయడం జరిగింది.రౌడీ షీట్ లో ఉన్న కొంతమంది నటీనటులు సైతం ఈ సినిమాలో నటించడం జరిగింది.రాజ్ కుమార్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది.

70 లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.బెంగళూరులోని కపిల్ థియేటర్ లో ఈ సినిమాను ఏకంగా 30సార్లు రీ రిలీజ్ చేయడం జరిగింది.2015 సంవత్సరంలో ఈ సినిమా డిజిటల్ హక్కులను విక్రయించగా 10 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయి.ఈ విధంగా ఈ సినిమా ఎన్నో సంచలనాలను సృష్టించింది.







