విజయ్ ఆంటోనీ( Vijay antony ) హీరోగా వచ్చిన బిచ్చగాడు( Bichagadu ) సినిమా తమిళం లో వచ్చిన పిచ్చే కారన్ అనే సినిమాకి తెలుగు డబుడ్ వెర్షన్…ఇక టాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు బిచ్చగాడుగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ ఒకే ఒక్క మూవీతో విజయ్ ఆంటోనీ కి తెలుగులోనూ తిరుగులేని మార్కెట్ క్రియేట్ అయింది.
ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించినప్పుడు తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఆ మధ్య విడుదలైన పాటలు ఆ హైప్ ను మరింత పెంచాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉండటంతో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది .మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి .మరి ఈ సినిమా అక్కడి ఆడియెన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంది.బిచ్చగాడు స్థాయి ఫలితాన్ని ఈ సీక్వెల్ అందుకుందా లేదా అనేది అక్కడి ఆడియెన్స్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం .

బిచ్చగాడు -2( Bichagadu2 ) చూసిన యుఎస్ ఆడియెన్స్ సినిమా పట్ల పాజిటివ్ గానే స్పందిస్తున్నారు .కంప్లీట్ కమర్షియల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగిందని అంటున్నారు .ముఖ్యంగా విజయ్ ఆంటోనీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని .ఫస్ట్ పార్ట్ లో ఒక్కడే రెండు భిన్నమైన నేపథ్యాల్లో కనిపించాడు.ఈసారి ఇద్దరులా కనిపిస్తూ ఆ ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారని చెబుతున్నారు .
గురుమూర్తిగా విజయ్ ఆంటోనీకి సంబంధించిన ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ అన్నీ అదిరిపోయాయని చెబుతున్నారు .యాంటీ బికిలీ ఎంట్రీ, కోర్ట్ డ్రామా ఇవన్నీ ఆసక్తికరంగా చూపించారని చెబుతున్నారు .దీంతో పాటు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అన్నాచెల్లెల ఎపిసోడ్ ప్రేక్షకుల హృదయాలను మరోసారి కట్టిపడేసేలా ఉందని సినిమా చూసిన ఆడియెన్స్ చెబుతున్నారు … విజయ్ గురుమూర్తి హత్యకు గురైనట్లు, ఆ కేసు విచారణ కోర్టులో జరుగుతున్నట్లు చూపించే సీన్స్ కొత్తగా ఉన్నాయంటున్నారు.విజయ్ గురుమూర్తిని సత్య ఎందుకు చంపాడు.విజయ్ గురుమూర్తికి సత్యకు ఉన్న సంబంధం ఏంటి.అనేది సినిమాలో చూపించిన విధానం బాగుంది అంటున్నారు.అద్భుతమైన టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చెప్పుకుంటున్నారు .హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కి యుఎస్ లో పాజిటివ్ టాక్ వస్తుంది .యాక్షన్ సన్నివేశాలను సైతం డూప్ లేకుండా ఆయన స్వయంగా చేశారని .అవన్నీ చాలా బాగా ఉన్నాయని అంటున్నారు .

సినిమాలోని మొదటి నాలుగు నిమిషాల సీన్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు. రక్తం, శరీరంలోని ఇతర అవయవాలు మార్చినట్లు మెదడును కూడా ట్రాన్స్ ప్లాంట్ చేస్తే ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని ఒక శాస్త్రవేత్త అందులో చెబుతారు.ఆయనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటారు.
ఐజక్ న్యూటన్, మహాత్మా గాంధీ, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి మేధావులను మరింత ఎక్కువ కాలం బతికించవచ్చని శాస్త్రవేత్త తెలుపుతారు.మంచి వాళ్లు ఎక్కువ కాలం బతికితే ఓకే, హిట్లర్ వంటి చెడ్డవారు, నియంతలు ఎక్కువ కాలం బతికితే ప్రజలకు నష్టం కదా అని ఎదురుగా కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అంటారు.
ఇక దానికి సినిమాలో జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం బాగుంది అంటున్నారు .విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని .ఖర్చుకు వెనకాడకుండా పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రెమ్ లోను కనిపిస్తుందని అంటున్నారు .లావిష్ బిల్డింగ్‌లు, ఫారిన్ లొకేషన్లతో చూడటానికి విజువల్ ట్రీట్‌లా ఉంది.బిచ్చగాడులో తల్లి ఆరోగ్యం కుదుటపడటం కోసం ధనికుడైన ఓ వ్యక్తి బిచ్చగాడిలా ఉండటం చూపించారు.సీక్వెల్ లో బిచ్చగాళ్లుగా ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి, కొందరు బడా మనుషులు ఎలాంటి పనులు చేస్తున్నారనేది బాగా చూపించారని యుఎస్ ఆడియెన్స్ చెబుతున్నారు…
.







