సూర్యాపేట జిల్లా: 2021- 22 రబీ సీజన్లో సీఎంఆర్ బకాయిలు ఉన్న మిల్లర్లు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా రైస్ మిల్లు యజమానులతో సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 32,045 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గడువులోగా డెలివరీ చేయాలన్నారు.
అదేవిధంగా ధాన్యం దిగుమతులలో కూడా ఆలస్యం లేకుండా మిల్లులకు వచ్చిన వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలన్నారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్.మోహన్ రావు,డిఎస్పి నాగభూషణం,డిఎం సివిల్ సప్లై బి.రాంపతి,డీఎస్ఓ పుల్లయ్య,రైస్ మిల్లుల యజమానులు అసోసియేషన్ సభ్యులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.