వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వైసీపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
విద్యుత్ కోతలు, చార్జీల వాతలకు ప్రభుత్వ విధానమే కారణమని పయ్యావుల మండిపడ్డారు.విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని విద్యుత్ కొరత రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.
ప్రస్తుతం ఏపీలో ఏడు మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతలో ఉందని చెప్పారు.విద్యుత్ రంగంలో దారుణమైన తప్పిదాలకు అవకతవకలకు తెరలేపిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
అధిక ధరలకు స్మార్ట్ మీటర్లు కొనుగోలు చేయడం దేనికని ప్రశ్నించారు.