ఇండియన్ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అనేది ఒక కంపల్సరీ యాస్పెక్ట్ అని ఓటీటీ సంస్థలు గుర్తించాయి.అందుకే ప్రతి వారం థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం కన్నా అలాంటి సినిమాలు ఓటీటీలో వస్తే చూసేద్దాం అనుకుంటున్నారు.
ప్రేక్షకుల కోరికను బట్టి ఓటీటీ సంస్థలు కూడా సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఓటీటీ ఒరిజినల్స్ ఇంకా వెబ్ సీరీస్ లతో వస్తున్నాయి.ఇండియన్ మార్కెట్ పై నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) ల హవా తెలిసిందే.
ప్రైమ్ కొన్నాళ్లుగా ఇండియన్ ఓటీటీ మార్కెట్ ని శాసిస్తుంది.

తెలుగు వెబ్ సీరీస్ లు సినిమాల వరకు అయితే ఆహా గట్టి పోటీ ఇస్తున్నా నేషనల్ వైడ్ గా మాత్రం అమేజాన్ ప్రైమ్అదరగొట్టేస్తుంది.ఇక రీసెంట్ గా ప్రైమ్ లో వచ్చిన వెబ్ సీరీస్( Web series ) లు మరోసారి సత్తా చాటేలా చేస్తున్నాయి.ఫర్జి( Farzi ), జుబ్లీ తో పాటుగా రీసెంట్ గా వచ్చిన దహాద్ కూడా అమేజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ సీరీస్ లుగా నిలిచాయి.
ఈ సీరీస్ ల వల్ల అమేజాన్ ప్రైమ్ ఓటీటీల్లో టాప్ ప్లేస్ లో ఉంది. ఇండియాలో నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ని టార్గెట్ చేస్తూ దాని గ్రాఫ్ తగ్గించాలని చూస్తున్నా అది మాత్రం వర్క్ అవుట్ అవ్వట్లేదు.







