కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది.కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిందని తెలుస్తోంది.
డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలుస్తోంది.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లను పార్టీ అధిష్టానం ఒప్పించింది.
ఢిల్లీ వేదికగా సీఎం అభ్యర్థి ఎంపిక విషయంపై నాలుగు రోజులుగా చర్చలు జరిగిన విషయం తెలిసిందే.డీకే శివకుమార్ కు సోనియా గాంధీ చర్చించిన తరువాత 2 +3 షేరింగ్ కు అంగీకరించారని సమాచారం.
ఈ క్రమంలో ఎల్లుండి బెంగళూరులో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.







