వైరల్: మెట్రోలో రెచ్చిపోయిన ముగ్గురు యువకులు!

ఈ మధ్య కాలంలో మెట్రో ట్రైన్స్ మరియు స్టేషన్లు వైరల్ వీడియోలకు అడ్డాగా మారాయి.ఈ మధ్య కాలంలో చూసుకుంటే అనేక రకాల వీడియోలు ఇక్కడినుండి సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతున్న విషయం మనం గమనించవచ్చు.

 Viral Three Young People Who Got Angry In The Metro, Metro, Train, Journey, Pass-TeluguStop.com

ఇక నేటి యువత ప్రతిఒక్కరి చేతిలో ఫోన్ ఉండడంతో వారు పాపులర్ కావడానికి దేనికైనా సిద్ధపడుతున్నారని ఆ వీడియోలు చూస్తేనే మనకి అర్ధం అయిపోతుంది.ఇక వారు తమ వీడియో వైరల్ కావడం కోసం, లైక్స్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు.

ఈ క్రమంలో వారు చుట్టూ వున్న జనాల్ని కూడా పట్టించుకోవడం కొసమెరుపు.పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు.ఇదేంటి అని ఎవరన్నా అడిగితే… ఇది సోషల్ మీడియా ప్రమోషన్ అంటూ అదేదో గొప్ప ఘనకార్యం అయినట్టు చెబుతున్నారు.ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా మెట్రోకు( metro ) సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కొందరు మెట్రోలో స్నానం చేస్తుండగా, మరికొందరు మెట్రోలో అసభ్యకర పనులు చేస్తూ కనిపించారు.

ఇప్పుడు తాజాగా లండన్‌లోని( London ) మెట్రోలో భారతదేశానికి చెందిన కొంతమంది పంజాబీ పాటకు డ్యాన్స్( Punjabi song ) వేయగా ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.కాగా ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.వైరల్ అవుతున్నవీడియోలో.

మెట్రో రైలు కోచ్ మొత్తం ఖాళీగా ఉండడం మనం గమనించవచ్చు.అమర్ సింగ్ చమ్కిలా, అమర్‌జోత్‌ల కంకర్డ్ గల్ సన్ మఖ్నా పాటకు ఈ ఇండియన్స్‌ డ్యాన్స్‌తో ఇరగదీశారు.

ఈలింగ్ బ్రాడ్ వే స్టేషన్ సమీపంలోని లండన్ ట్యూబ్‌లో పంజాబీలు చేసిన డ్యాన్స్‌ వీడియో వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube