సెలబ్రిటీలను విమర్శించడం ద్వారా పాపులారిటీ సొంతం చేసుకోవచ్చు అంటూ కొంత మంది సోషల్ మీడియా కి చెందిన వారు భావిస్తూ ఉంటారు.సునీషిత్( Sunishit ) అనే వ్యక్తి గత కొంత కాలంగా యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ తాను ఆ సినిమా ను చేశాను.
ఈ సినిమా లు చేశాను, ఆ సినిమా మధ్యలో ఆగి పోయింది.ఈ సినిమా పూర్తయిన కూడా విడుదల కాలేదు అంటూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు.
పెద్ద హీరోల కోసం తాను చాలా కథలను త్యాగం చేశానంటూ కూడా పలు సందర్భాల్లో సునిషిత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇటీవల రామ్ చరణ్( Ram Charan ) మరియు ఆయన భార్య ఉపాసన గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సునిషిత్ కి మెగా ఫ్యాన్స్ దేహ శుద్ధి చేసిన విషయం కూడా తెలిసిందే.
చితక బాది అతడిని మీడియా ముందుకు తీసుకు వచ్చి రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు క్షమాపణలు చెప్పించారు.ఆ తర్వాత అతడిని పోలీసులకు మెగా ఫ్యాన్స్ అప్పగించారు.
అయినా కూడా అతడి బుద్ధి మారలేదు.
కుక్క తోక వంకర అన్నట్లుగా అతని ప్రవర్తన వంకరగానే ఉంది.ఏం చేసినా కూడా తాను మారను.మారాలి అనుకోవడం లేదు అనుకుంటున్నాడేమో కానీ మెగా ఫ్యాన్స్ కొట్టి కొన్ని రోజులు కూడా కాకుండానే ఎన్టీఆర్( NTR ) ఫ్యాన్స్ చేతిలో దెబ్బలు తినాలని తహతలాడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో తన్నించుకుని మరో సారి వార్తల్లో నిలిచి సెలబ్రిటీ అవ్వాలని ఆశ పడుతున్నాడా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.తాజాగా ఎన్టీఆర్ గురించి ఏ ఒక్కరు సహించని కామెంట్ సునిషిత్ చేశాడు.
ఆయన అభిమానులు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ సినిమాలను చూసి ఇష్టపడేవారు, అభిమానులు కాని వారు కూడా సునిషిత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకు సునిషిత్ ఏమన్నాడంటే.గతంలో ఎన్టీఆర్ బూతు సినిమాల్లో నటించాడు.ఆ విషయాన్ని ఇండస్ట్రీలో నేనొక్కడిని మాత్రమే మీడియా ముందు మాట్లాడగలను.మరి ఎవరు కూడా ఈ విషయాన్ని చెప్పే అంత ధైర్యం చేయలేరు అంటూ ఎన్టీఆర్ గురించి సునిషిత్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దాంతో నందమూరి అభిమానులు ప్రస్తుతం సునిషిత్ ఎక్కడున్నాడు అంటూ వెతికి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ కోపంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అతడు తారసపడితే కచ్చితంగా మొన్నటి దెబ్బల కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.