మూడో భార్య కోసం కొడుకుని చంపేసిన తండ్రి..!!

ప్రస్తుత సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి.తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమానురాగాలు ఉన్నకొద్ది బలహీన పడుతున్నాయి.

 Father Who Killed Son For Third Wife , Madhya Pradesh, Father Kill Son-TeluguStop.com

ఆస్తుల కోసం పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు.ఈ క్రమంలో కొంతమంది పిల్లలు… తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు.

కొంతమంది అక్రమ సంబంధాల కోసం కన్న పిల్లలను చాలా దారుణంగా చంపేస్తున్నారు.ఈ రకంగానే మధ్యప్రదేశ్( Madhya Pradesh ) రాష్ట్రంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.

పరిస్థితి ఇలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడో భార్య కోసం ఒక తండ్రి కన్న కొడుకుని చంపేశాడు.పూర్తి వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో దారుణం చోటుచేసుకుంది.శశిపాల్( Sashipal ) అనే వ్యక్తి తన ఏడేళ్ల ప్రతిక్ ను హత్య చేసేసాడు.గాడ నిద్రలో ఉన్న కొడుకుని టీవీ వాల్యూమ్ పెంచి గొంతు పిసికి చంపేసి పారిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు శశిపాల్ నీ… అతని మూడో భార్య పాయల్( Payal ) నీ అరెస్టు చేయడం జరిగింది.పాయల్ ఇటీవల మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది.

ప్రతీక్ నీ చంపితేనే ఇంటికి వస్తానని చెప్పటంతో శశి పాల్ తన కొడుకుని చంపాడని పోలీసుల విచారణలో తేలింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube