కర్ణాటక సీఎంపై ఇవాళ సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అధికారిక ప్రకటన చేయనుంది.సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రకటించనున్నారు.
కాగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటన చేయనుంది.మరోవైపు కర్ణాటక వ్యాప్తంగా సిద్ధరామయ్య మద్దతుదారులు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
ఇందులో భాగంగా బెంగళూరులో సిద్ధరామయ్య ఇంటి దగ్గరకు మద్దతుదారులు భారీగా తరలివస్తున్నారు.







