ఇప్పుడున్న హీరోయిన్స్ కాకుండా వీరి కంటే ముందు వచ్చిన హీరోయిన్స్ చాలామంది సినిమాలకు గుడ్ బై చెప్పేసి దూరంగా బ్రతుకుతున్నారు.కారణం కొత్త హీరోయిన్ లు రావడంతో వారికి అవకాశాలు లేకపోవడం వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు.
మరి కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవ్వగా.కొంతమంది మాత్రం మరోసారి రీ ఎంట్రీ ఇస్తూ సహాయక పాత్రలలో, చిన్న చిన్న పాత్రలలో అవకాశాలు అందుకుంటున్నారు.
అయితే ఎప్పుడో ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ సలోని( Heroine Saloni ) ఇంత కాలానికి దర్శనమిచ్చింది.అది ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం.
సలోని ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిందని చెప్పాలి.పక్కింటి అమ్మాయిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా 2003లో బాలీవుడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఇక 2005లో ధన 51, ఒక ఊరిలో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.ఇక ఈ సినిమాలలో తన నటనకు మంచి మార్కులు వచ్చాయి.

ఆ తర్వాత చుక్కల్లో చంద్రుడు, కోకిల, మర్యాద రామన్న,( Maryada Ramanna ) తెలుగు అమ్మాయి వంటి సినిమాలలో హీరోయిన్గా నటించగా మరికొన్ని సినిమాలలో అతిథి పాత్రలో కూడా నటించింది.కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ భాషలలో కూడా నటించింది.ఎక్కువ గుర్తింపు వచ్చిన సినిమా మర్యాద రామన్న అని చెప్పాలి.
అయితే 2015లో సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఇప్పటివరకు ఏ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకోలేదు.
దీంతో కొత్త హీరోయిన్ ల రాకతో ఈ అమ్మడి పై దర్శకనిర్మాతలు దృష్టి పెట్టలేదని తెలిసింది.ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా బాగా టచ్ లో ఉండేది.

ఇక ఇప్పుడు అంతగా యాక్టివ్ గా కనిపించడం లేదు కానీ.ఆమధ్య బాగా రీల్స్ చేసేది.తన ఫోటోలు కూడా బాగా షేర్ చేసుకునేది.ఇక గత కొంతకాలం నుంచి తనకు సంబంధించిన పోస్ట్లు ఏవి షేర్ చేయడం లేదు.ఇక ఒకప్పుడు మంచి ఫిజిక్ తో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాగా లావుగా మారిందని చెప్పవచ్చు.బహుశా తన ఫోటోలు పంచుకోవడానికి ఇష్టపడటం లేదని అర్థమవుతుంది.
అయితే ఇంత కాలానికి ఈ ముద్దుగుమ్మ ఓ జువెలరీ మాల్ ఓపెనింగ్ లో( Jewelery Mall Opening ) కనిపించింది.చాలా ఏళ్లకు కనిపించిన ఈ ముద్దుగుమ్మ కాస్త లావుగా ఉండటంతో మొదట చాలామంది అంతగా గుర్తుపట్టలేకపోయారు.
ఆ తర్వాత సలోని అని తెలిసిన వెంటనే ఆశ్చర్యపోయారు.ఇక మళ్లీ ఈ ముద్దుగుమ్మ జాడ కనిపించలేదని చెప్పాలి.

ఇక గతంలో ఈ ముద్దుగుమ్మ ఒక హీరోతో లవ్ లో ఉందని జోరుగా పుకార్లు వచ్చాయి.ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూ తన ఫ్యామిలీతో ముంబైలో సెటిల్ అయిందని తెలుస్తుంది.బాలీవుడ్ లో మాత్రం సహాయక పాత్రలో అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ నో అని చెప్పేస్తుందని తెలిసింది.







