ఖమ్మంలో దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో వివాదం ముదురుతోంది.ఈ నేపథ్యంలో రేపు ఇందిరాపార్క్ వద్ద హిందూ సంఘాల నిరసన సభ జరగనుంది.
ఈ క్రమంలో కరాటే కల్యాణికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ చేశారని సమాచారం.ఆందోళన విరమించుకోవాలని ఆయన సూచించారు.
అయితే కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ‘మా’ సభ్యురాలు, సినీ నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె ఎన్టీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.







