తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ(Mega Family) కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఇలా మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకరు.
ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఒకవైపు సినిమా షూటింగ్లో మరోవైపు రాజకీయాలలో తిరుగుతూ ఈయన పూర్తిగా తన ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అంటూ తాజాగా తన తల్లి అంజనాదేవి(Anjana Devi) ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన కుమారుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో పాల్గొంటూ ఎండనక వాననక తిరుగుతూ ఉన్నారని తెలిపారు.అయితే తన కుమారుడికి చిన్నప్పుడు ఆస్తమా ఉండేదని, అందుకే తనని చాలా జాగ్రత్తగా పెంచానని ఈమె తెలిపారు.ప్రస్తుతం కొన్ని కోట్ల మంది ప్రజలకు సహాయం చేయమని భగవంతుడు వాడిని ఆదేశించాడు.
అందుకోసమే ఇలా కష్టపడుతున్నాడని త్వరలో తాను అనుకున్నది సాధిస్తాడు అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి తన తల్లి అంజనా దేవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఇంటర్వ్యూలో ఈమె తన పెద్ద కుమారుడు చిరంజీవి(Chiranjeevi) తన భార్య సురేఖ(Surekha) గురించి కూడా పలు విషయాలు తెలియజేశారు.చిన్నప్పటినుంచి చిరంజీవికి ఎవరైనా ఇబ్బందులలో ఉన్నారు అంటే తనదైన శైలిలో సహాయం చేసేవారు.ఇప్పటికీ ఆ సేవాగుణం అలాగే కొనసాగుతూ వస్తోందని తెలిపారు.
ఇక తన కోడలు సురేఖ గురించి మాట్లాడుతూ తాను కోడలు కాదని కూతురిల తనని చూసుకుంటుందని అలాంటి అమ్మాయి నాకు కోడలుగా రావడం నిజంగా అదృష్టం అంటూ ఈ సందర్భంగా అంజనాదేవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







