సినిమా ఇండస్ట్రీ ఎవరికి ఊరికే పేరు తెచ్చి పెట్టదు.ఒకసారి అవకాశం ఇచ్చాక నిలబడిన, నిలబడక పోయిన దాని తాలూకా ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
సినిమా ఇండస్ట్రీ లోకి ఎన్నో కళలతో వెళ్లి ఆ కళలు కొంత మేర నెరవేరిన అది ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేక చాల మంది అవస్థలు పడుతూ ఉంటారు.ఇందుకు ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ళు చాల మంది అతీతులు ఏమి కాదు.
ఉదాహరణకు మనసంతా నువ్వే( Manasantha Nuvve ) వంటి సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు వి ఎన్ ఆదిత్య( Director VN Aditya ) వంటి దర్శకుడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆయనకు మొదట్లో చాల మంచి సక్సెస్ వచ్చింది.
కానీ కాలక్రమేణా అయన సినిమాలు ప్లాప్ అవ్వడం, అయన ఇండస్ట్రీ నుంచి దాదాపు అవుట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.కానీ సినిమా తప్ప మరొక ప్రపంచం తెలియని ఆదిత్య గారు ప్రస్తుతం ఇండస్ట్రీ లోని కొన్ని పెద్ద ప్రొడక్షన్ కంపెనీ లకు లైన్ ప్రొడ్యూసర్ గా, అలాగే ఆ సంస్థల తాలూకు కథ చర్చల్లో పాల్గొంటూ వాటి బలాబలాను అంచనా వేస్తూ బడ్జెట్ కేటాయించడం వంటివి చేస్తూ ఉన్నారు.ఆ రకంగా కొంత మేర ఆదాయం పొందుతూ సినిమా ఇండస్ట్రీ లోనే జీవితాన్ని లాగిస్తున్నారు.
అయితే అయన భార్య ( VN Aditya Wife ) మాత్రం కుటుంబం కోసం ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ గా మారారు.ఇంతలా అయన భార్య కుటుంబం కోసం త్యాగం చేయడం అనేది ఒకింత బాధాకరం అయినప్పటికి, సినిమా ఇండస్ట్రీ లో చాల మంది తెరమరుగు అవుతున్న వారి పరిస్థితి దాదాపు ఇలాగే ఉంటుంది.
వారి తొలినాళ్ళు బాగానే గడిచిన ఒక టైం గడిచి పోయాక ఆ పరిస్థితి ఉండదు.కొంత మంది బయట పడుతున్నారు కానీ అందరి వల్ల అది సాధ్యం కాదు.అందుకే ఇక్కడే ఎదో ఒక విధంగా వారి టైం గడిపేస్తూ ఉన్నారు.అయితే వారి జీవితాలు ఎలా గడిచిన వారి భార్యల పరిస్థితి చూస్తే మాత్రం ఎంతో బాధను మిగులుస్తుంది.
ఇంత చేసి ఏమి సాధించలేని వారు భార్యల సంపాదన పై బ్రతకడం అనేది చెప్పుకోవడానికి కూడా ఎంతో కష్టాన్ని మిగిలిస్తుంది.