ఇండస్ట్రీ లో ఎంతో మంది క్యారక్టర్ ఆర్టిస్టులు వస్తుంటారు పోతుంటారు, కానీ కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టులు మాత్రం ఎప్పటికీ గుర్తుంది పోతుంటారు, అలాంటి వారిలో ఒకరు సుబ్బరాజు.( Actor Subbaraju ) క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన సంచలనాత్మక చిత్రం ‘ఖడ్గం’ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా సుబ్బరాజు తొలిసినిమాతోనే మంచి గుర్తింపుని అందుకున్నాడు.
ఆ తర్వాత ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం లో విలన్ గా నటించి ఓవర్ నైట్ స్టార్ ఆర్టిస్టుగా మారిపోయాడు.ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.2004 వ సంవత్సరం నుండి ఏడాదికి ఆయన కనీసం పది సినిమాల్లో నటించేంత డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా మారిపోయాడు.ఈ ఏడాది ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’( Waltair Veerayya ) చిత్రం లో ముఖ్యమైన పాత్ర పోషించాడు,గడిచిన రెండు మూడేళ్ళలో సుబ్బరాజు చేసే సినిమాల సంఖ్య కాస్త తగ్గింది, ఏడాదికి పదికి పైగా సినిమాలు చేసే ఆయన ఇప్పుడు 4 నుండి 5 సినిమాల వరకు చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా కొద్దిరోజుల క్రితమే సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఈ ఇంటర్వ్యూ లో ఆయన ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చకచకా చెప్పేసాడు.యాంకర్ అడుగుతూ ‘ఇప్పుడు మీరు హీరో గా ఒక సినిమా చేస్తే, అందులో విలన్ గా మీరు ఏ హీరో ని కోరుకుంటారు’ అని అడగగా, దానికి సుబ్బరాజు సమాధానం చెప్తూ ‘అల్లు అర్జున్ ని( Allu Arjun ) కోరుకుంటాను’ అని అంటాడు.ఇంకా ఆయన వివరణ ఇస్తూ ‘అల్లు అర్జున్ తోనే నాకు ఇప్పటి వరకు ఎక్కువ పోరాట సన్నివేశాలు ఉన్న సినిమాలు వచ్చాయి, అందుకే అల్లు అర్జున్ కావాలి, నా పొడవుకి తగ్గ హీరో ని విలన్ గా పెట్టుకోవాలంటే ప్రభాస్ ని కానీ మహేష్ బాబు ని కానీ కోరుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు.ఇంకా యాంకర్ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ‘మీరు జీవితాంతం ఈ పాత్రలోనే స్థిరపడిపోవాలని కోరుకునేది ఏమిటి , హీరోనా , విలనా లేదా క్యారక్టర్ ఆర్టిస్టుగానా? అని అడిగిన ప్రశ్న కి సుబ్బరాజు సమాధానం చెప్తూ ‘కేవలం నటుడిగా మాత్రమే ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.

సుబ్బరాజు సినిమాల్లోకి రాకముందు డెల్ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు.ఈయన భీమవరం లోని DNR కళాశాలలో డిగ్రీ పూర్తి చేసాడు.సునీల్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈయనకి క్లాస్ మేట్స్, ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో అవకాశాల కోసం త్రివిక్రమ్ చుట్టూ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి.అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన సుబ్బరాజు చూసేందుకు హీరో లాగా ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఆయన క్యారక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయ్యాడు.
ఇక బాహుబలి 2 లో మంచి పాత్ర పోషించినందుకు సుబ్బా రాజు కి పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు లభించింది, జపాన్ లో ఈయనకి మంచి క్రేజ్ కూడా ఉంది.రాబొయ్యే రోజుల్లో సుబ్బరాజు ఇంకెన్ని విభిన్నమైన పాత్రలు పోషిస్తాడో చూడాలి.







