మద్యం మత్తులో ఉన్న భర్త ప్రమాదవశాత్తు రాళ్లపై పడి మృతి చెందాడని భార్య పోలీసులకు( Police ) ఫిర్యాదు చేసింది.పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేయగా విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
భార్య తన అన్నదమ్ములతో కలిసి భర్తను హత్య మార్చి, ప్రమాదవశాత్తు మరణంగా అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది.అసలు నిజాలు తెలియడంతో నెల్లూరు నగరంలో తీవ్ర కలకలం రేగింది.
వివరాల్లోకెళితే. నెల్లూరు ( Nellore )నగరంలోని గాంధీనగర్ లో షేక్ సుబహాన్ (39), అబీదా అనే దంపతులు నివాసం ఉంటున్నారు.సుబహన్ పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.ఈనెల ఏడవ తేదీ రాత్రి రెవెన్యూ కాలనీ చివరలో సుబహాన్ తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి, అతని భార్య అబీదా కు సమాచారం అందించారు.
భార్య అబీదా వెంటనే సంఘటన స్థలానికి వచ్చి భర్తను చికిత్స నిమిత్తం జీజీహెచ్ కు తీసుకువెళ్లింది.పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స అందించడం కోసం సుబహన్ ను తిరుపతికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
భార్య మాత్రం భర్త మద్యం మత్తుతో రాళ్లపై పడి మృతి చెందాడని వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కానీ పోలీసులకు అబీదా ప్రవర్తనపై కాస్త అనుమానం రావడంతో కేసును లోతుగా, అన్ని కోనాల్లో దర్యాప్తు చేయడంతో అన్నదమ్ములతో కలిసి అబీదా తన భర్తను హత్య చేసినట్లు బయటపడింది.పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా తాజాగా సోమవారం నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
సుబాహన్ మద్యం సేవించి భార్యను తీవ్రంగా వేధించేవాడు.బావమరుదులు షేక్ మహమ్మద్( Sheikh Mohammed ), షేక్ గౌస్ భాషలు పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు బావను కోరారు.కానీ సుబహన్ తన పద్ధతి మార్చుకోకుండా ఈనెల ఏడవ తేదీ పీకల తాక మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు.
దీంతో బావమరుదులు ఇద్దరు సుబహన్ రెవెన్యూ కాలనీలోని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి సిమెంట్ రబ్బిష్ రాయితో తీవ్రంగా కొట్టారు.అక్కడి నుండి వెళ్లి అబీదాకు సమాచారం అందించారు.
అబీదా హత్య కేసును కాస్త పక్కదారి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికి జైలు పాలు అయింది.