మృణాల్ సేన్( Mrinal Sen ) తన చిత్రాల ద్వారా అంతర్జాతీయంగా భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన చిత్రనిర్మాత.అవిభాజ్య బెంగాల్‌లోని ఫరీద్‌పూర్( Faridpur in Bengal ) పట్టణంలో 14 మే 1923న జన్మించిన మృణాల్ సేన్ సమాజ వాస్తవికతను కళాత్మకంగా చిత్రించడంలో ప్రసిద్ధి చెందారు.
మృణాల్ కోల్‌కతాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.దీని తరువాత అతను ఫిల్మ్ స్టూడియోలో ఆడియో టెక్నీషియన్‌గా పనిచేయడం ప్రారంభించారు.
ఇక్కడి నుంచి ఆయన సినీ జీవితం మొదలైంది.మృణాల్ సేన్ ఆ సమయంలో సినిమా నిర్మాణం గురించిన చాలా పుస్తకాలు చదివారు.దీంతో ఆయనలో సినిమాలు రూపొందించాలనే కోరిక మొదలైంది.1955లో అతను తన మొదటి చిత్రం రాత్‌భోర్‌ని నిర్మించారు.ఇది పెద్దగా విజయాన్నివ్వలేదు.అది అతని హృదయాన్ని కలవరపరిచింది.

కొంత విరామం తర్వాత నీల్ ఆకాశేర్ నీచే సినిమా చేసారు.ఈ సినిమా అతనికి దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది.అతని మూడవ చిత్రం బైషే శ్రవణ్ మృణాల్ సేన్‌ను అంతర్జాతీయంగా నిలబెట్టింది.బెంగాలీ భాషలోనే కాకుండా హిందీ, ఒరియా, తెలుగు భాషల్లో కూడా ఎన్నో సినిమాలు చేశారు.80 సంవత్సరాల వయస్సులో అతను 2002లో తన చివరి చిత్రం అమర్ భువన్ చేశారు.

మృణాల్ సేన్ 30 డిసెంబర్ 2018న మరణించారు.మృణాల్ సేన్‌కి అవార్డులు, సన్మానాలు రావడం కొత్త విషయం కాదు.2005లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్‌తో సత్కరించింది.మృణాల్ సోవియట్ ల్యాండ్ అవార్డు( Soviet Land Award ) (1979), పద్మ భూషణ్( Padma Bhushan ) (1981), ఫ్రాన్స్‌కు చెందిన కమాండర్ డి ఓర్ డెస్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్ (1983), ఆసియన్ ఫెడరేషన్ నుంచి ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ (2000)తో పాటు మిలన్‌లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.

పూణే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు- 2000లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్( Russian President Vladimir Putin ) మృణాల్ సేన్‌ను అతని దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్‌తో( Order of Friendship ) సత్కరించారు.ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ చిత్రనిర్మాతగా నిలిచారు.మృణాల్ సేన్ 1998-2003 మధ్య రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు.2005లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.మృణాల్ సేన్‌ను మృణాల్ దా అని ముద్దుగా పిలుస్తుంటారు.
అతని సినిమాలు ఇప్పటికీ పెద్ద ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రదర్శింస్తుంటారు.తద్వారా విద్యార్థులు అతని నుండి ఫిల్మ్ మేకింగ్ మెళకువలను నేర్చుకుంటుంటారు.
సినిమా మాధ్యమంతో మృణాల్ సేన్ చేసిన ప్రయోగాలు, కథను చెప్పేందుకు అవలంబించిన విధానం ఎంతో ప్రత్యేకం.ఈ సాంకేతిక విప్లవ యుగంలో ఆయన సినిమాలు యువ చిత్ర నిర్మాతలకు దగ్గరగా కనిపించడానికి కారణం ఇదే.మృణాల్ సేన్ కేన్స్, చికాగో, బెర్లిన్, వీనస్, టోక్యో తదితర ఫెస్టివల్స్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.







