సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక్కసారి చాలా భయానకంగా అనిపిస్తాయి.నేటి యువతకి సాహసాలు కాస్త ఎక్కువే.
ఇక తమ మనసులోని కోరికలను ట్రావెలింగ్ సమయంలో టూర్లకు వెళ్ళినపుడు తీర్చేసుకుంటారు.ఈ క్రమంలో చాలామంది అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటివి ఆడడానికి ఇష్టపడుతూ వుంటారు.
ఈ క్రమంలో చాలామంది ప్రమాదాలకు గురవుతూ వుంటారు.ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం గమనించవచ్చు.

బంగీ జంప్( Bungee jump ) గురించి మీరు వినే వుంటారు.తాడు సాయంతో కొన్ని వందల అడుగుల కిందకు వేలాడడం.ఇలాంటి ఫీట్లు గుండె ధైర్యం వున్నవారు మాత్రమే చేయగలరు.లేదంటే ప్రాణాలు అలా గాల్లోకి వెళ్లిపోతాయి.ఎందుకంటే అందులో ఉన్న రిస్క్‌లు అలాంటివి! తాజాగా ఓ యువతి( young woman ) బంగీ జంప్ సాహసానికి దిగింది.ఈ నేపథ్యంలో అక్కడి ఆపరేటర్ ఆమెను లాంచింగ్ ప్యాడ్ ( launching pad )నుంచి కిందకు తోయడం చూడవచ్చు.
అయితే యువతి బంగీ జంపింగ్ మధ్యలో ఉండగానే కాళ్లకు కట్టిన తాడు తెగిపోయింది.

దీంతో ఆ యువతి అమాంతం కింద ఉన్న నీళ్లలో పడిపోయింది.ఈ భయానకమైన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా పలువురు నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు.ఎక్కువమంది నెటిజన్లు ఆమె సురక్షితంగానే ఉందంటూ కామెంట్లు చేయడం ఇక్కడ చూడవచ్చు.
సీసీటీవీ ఐడియట్స్ అనే ట్విటర్‌పేజ్ నుంచి ఈ వీడియో పోస్ట్ కాగా, మిలియన్ల వ్యూస్‌తో విపరీతంగా వైరల్ అవుతోంది.అయితే పలువురు నిపుణులు మాత్రం ఇలాంటి ఫీట్లు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు.







