సంజయ్ ను మార్చాలి... రాజేందర్ కు ఆ బాధ్యతలు ఇవ్వాలి ! 

తెలంగాణ బిజెపి( Telangana BJP )లో ముసలం పుట్టినట్టుగా కనిపిస్తోంది.ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత తెలంగాణ బీజేపీలో నెలకొన్న అసంతృప్తులు బయటకు వచ్చాయి.

 Telangana Bjp Leaders Demand For Etela Rajender As Telangana Bjp President , Tel-TeluguStop.com

సార్వత్రిక ఎన్నికలకు సమయం కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో,  తెలంగాణ బిజెపిలో భారీగా ప్రక్షాళన చేపట్టకపోతే పార్టీ అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొంత మంది కీలక నేతలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తొలగించాలని డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ బిజెపి లో బండి సంజయ్ వ్యవహారాలపై అధిష్టానం దృష్టి సారించిందని, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుందని,  భారీగా ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమైందని,  దీనిలో భాగంగానే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం మొదలైంది.

Telugu Amith Sha, Bandi Sanjay, Congress, Telangana Bjp, Telangana, Ts-Politics

 తాజాగా బండి సంజయ్( Bandi Sanjay ) ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆస్థానంలో హుజురాబాద్ ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ కు( Etela Rajender , ) పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది మంది కీలక నేతలు అధిష్టానం కోరినట్లు సమాచారం  సంజయ్ ను తప్పించకపోతే తెలంగాణలో బిజెపి తీవ్రంగా నష్టపోతుందని, ఆయనను గనుక కొనసాగిస్తే తామంతా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమని సంకేతాలను పంపించారట చేరికలు కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకపోతే ఆయన కూడా బిజెపికి రాజీనామా చేస్తానని చెప్పాలని అసంతృప్తి నేతలు ఒత్తిడి చేస్తున్నారట.ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యేందుకు రాజేందర్ నిన్న ఢిల్లీకి వెళ్లారు.తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితులను బిజెపి అగ్ర నేతలు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట.

Telugu Amith Sha, Bandi Sanjay, Congress, Telangana Bjp, Telangana, Ts-Politics

బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతలు నుంచి తప్పించకపోతే సీనియర్ నేతలు అంతా పార్టీకి రాజీనామా చేయడంతో పాటు , కొత్త పార్టీని స్థాపించి 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారట.ఇప్పటికే సంజయ్ వ్యవహారంపై పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉందనే వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు అసమ్మతి నేతలు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పడం , ఈటెల రాజేందర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వినిపించడం ఇవన్నీ చర్చనీయాంసంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube