జాతీయ రాజకీయాల్లో శూన్యత ఉన్నదని, దానిని భర్తీ చేసి రాజకీయంగా చక్రం తిప్పాలని గత రెండు సంవత్సరాలుగా బారాస అధినేత కేసీఆర్ బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు… భాజాపాను నిలువురించే శక్తి కాంగ్రెస్కు లేదని, ఆ స్థితి లోకి కాంగ్రెస్ వచ్చే అవకాశం కూడా లేదని భావించిన కేసీఆర్ ,ఈ రెండు పార్టీలతో సమాన దూరం పాటించే పార్టీలను కలుపుకొని జాతీయస్థాయిలో కూటమి ఏర్పరచాలని బలంగా ప్రయత్నించారు .ఆ దిశగా దాదాపు అన్ని పార్టీలను కలిసిన ఆయన సమాలోచనలు చేశారు .
అయితే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లుగా , గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పునర్ వైభవం దిశగా సాగుతూ ఉండటం బారాస రాజకీయ ఆశలకు అవరోధం కలిగించినట్లుగా తెలుస్తుంది.హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఐ సి యు లో ఉన్న ఆ పార్టీ భవిష్యత్తుకు ఊపిరి ఊదినట్టుగా తెలుస్తుంది.
కొత్త విజయంతో కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్( Congress ) శ్రేణులు వచ్చే ఎన్నికలపై మరింత పట్టుదలగా దూసుకెళ్తున్నారు.అంతేకాకుండా ఇప్పటివరకు కాంగ్రెస్తో దూరం పాటించిన చాలా ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించడానికి అంగీకరిస్తున్నాయి .

బీహార్ లో నితీష్ కుమార్, ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ తమిళనాడులో స్టాలిన్ ఇప్పటికే ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్కు పెద్దన్న పాత్రకు మద్దతు తెలుపుగా ,ఇప్పుడు ఆ లిస్టులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) కూడా చేరారు.వచ్చే లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలలో తమ అభ్యర్థులను నిలబెట్టమని ఆ సాంప్రదాయాన్ని కాంగ్రెస్ కూడా పాటిస్తుందని తాను భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.తద్వారా బాజాపా ను ఓడించే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందని ఈ పార్టీ లు అంగీకరించి నట్లయింది .

సంఖ్యాపరంగా బలంగా ఉన్న ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించినందున ఇప్పుడు మూడో కూటమి ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ వ్యూహానికి పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పవచ్చు .అందువల్ల తెలంగాణలో ఎన్నికల్లో ముగిసిన వెంటనే కాంగ్రెస్ నాయకత్వానికి జై కొట్టక తప్పని పరిస్థితి కెసిఆర్ ( CM KCR )కి ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి.మారుతున్న ప్రజాభిప్రాయాలను వేగంగా పట్టుకోగల నేర్పు కేసీఆర్ కు ఉంది .మరి జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులను అంగీకరించి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి చే కొడతారా లేక దూరంగానే ఉండే అవకాశం కోసం ఎదురు చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది
.






