తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత ఏడాది సర్కారు వారి పాట( Sarkaru Vari Paata ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్( Director Trivikram ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.
ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారు కానీ అప్పటినుంచి వాయిదా పడుతూనే వస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు వెకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.తొందర్లోనే ఇండియాకు రాబోతున్నాడు.కాగా వచ్చే నెల అయిదు లేదు ఆరున షూట్ ప్రారంభం అవుతుంది.
చిన్న చిన్న గ్యాప్ లు మినహా 90 రోజుల పాటు కంటిన్యూగా షూట్ చేయాలన్నది ప్లాన్.కానీ ఇక్కడ చిన్న తకరారు ఉందని తెలుస్తోంది.తనకు మొత్తం తొంభై రోజుల షెడ్యూలు ఇవ్వమని హీరో మహేష్ బాబు కోరుతున్నట్లు తెలుస్తోంది.కానీ మహేష్ బాబు అనుకున్న యాక్టర్ల డేట్ లు దొరక్కపోతే మార్చేసి, డేట్ లు దొరికేవారిని తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది.
మరి ఇందుకు త్రివిక్రమ్ ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తోంది.

తనకు బౌండ్ స్క్రిప్ట్, తొంభై రోజుల షెడ్యూలు రెండూ ఇవ్వాల్సిందే అని మహేష్ పట్టుదలగా ఉన్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అది త్రివిక్రమ్ వల్ల, నిర్మాత వల్ల అవుతుందా అన్నది చూడాలి మరి.ఇదిలా వుంటే ఈ నెల 31న కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్, లుక్ విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.అలాగే కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు.ఆ థియేటర్లలో ఈ వీడియో ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.







