రెండేళ్ల క్రితం భారతీయుడిని చంపిన కేసులో కెనడా( Canada ) జాతీయుడికి 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్ట్.వివరాల్లోకి వెళితే.2017లో భారతదేశం నుంచి కెనడాలోని నోవా స్కోటియా ప్రావిన్స్‌కు వచ్చాడు 23 ఏళ్ల ప్రభ్‌జోత్ సింగ్ కత్రి.( Prabhjot Singh Katri ) ఈ క్రమంలో 2021 సెప్టెంబర్ 5న 494 రాబీలో స్నేహితుడి అపార్ట్‌మెంట్ నుంచి తన కారు వద్దకు వెళ్తుండగా నిందితుడు కామెరాన్ జేమ్స్ ప్రాస్పర్( Cameron James Prosper ) వెనుక నుంచి కత్తితో పొడిచినట్లు గ్లోబల్ న్యూస్ నివేదించింది.
తీర్పు సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జెఫ్రీ హంట్ మాట్లాడుతూ.ఈ దాడి హేతుబద్ధమైన కారణం లేకుండా జరిగిందన్నారు.మృతుడి మరణంతో అతని కుటుంబం కృంగిపోయిందని.యావత్ సమాజాన్ని బాధించిందని అన్నారు.
నిందితుడు ప్రాస్పర్‌పై తొలుత సెకండ్ డిగ్రీ హత్యకు పాల్పడినట్లుగా అభియోగాలు మోపారు.కానీ డిసెంబర్ 2022లో కోర్టులో హాజరుపరిచే సమయంలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

మరణించడానికి ముందు.కత్రి లేటన్ టాక్సీలో పనిచేస్తున్నాడు.హత్య జరిగిన రోజున నిందితుడు ప్రాస్పర్, డైలాన్ రాబర్ట్ మెక్‌డొనాల్డ్‌తో కలిసి భవనం వెలుపల వున్నాడని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో విన్నవించారు.అపార్ట్‌మెంట్ బయటకు నడుచుకుంటూ వస్తున్న కత్రిని.
ప్రాస్పర్ ఫోల్డింగ్ నైఫ్‌తో మెడపై పొడిచాడు.దీంతో బాధితుడు గాయంతోనే తన స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లోకి పరిగెత్తాడు.
దీంతో కత్రి స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే కత్రి రక్తపు మడుగులో పడి వున్నాడు.
రక్తస్రావం జరగకుండా ఇద్దరు వ్యక్తులు అతని మెడ చుట్టూ గుడ్డని చుట్టి పట్టుకుని వున్నారు.

అప్పటికే ప్రాస్పర్ , మెక్‌డొనాల్డ్‌లు తెలుపు రంగు హోండా సివిక్‌లో ఘటనాస్థలం నుంచి పారిపోయారు.ఆపై పోలీసులు కత్రిని ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
మెక్‌డొనాల్డ్‌పై హత్యకు అనుబంధంగా అభియోగాలు మోపారు పోలీసులు.నిందితుడితో కలిసి తప్పించుకోవడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి నేరాలపై కేసులు నమోదు చేశారు.
ఇందుకుగాను కోర్ట్ అతనికి 14 నెలల జైలు శిక్ష, 12 నెలల పరిశీలన, 1000 డాలర్ల జరిమానా, ఏడాది పాటు లైసెన్స్ సస్పెన్షన్, ఏడాది పాటు డ్రైవింగ్‌పై బ్యాన్ విధించింది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన విచారణ సందర్భంగా క్రౌన్ ప్రాసిక్యూటర్ థామస్ కేటర్ మాట్లాడుతూ.
కత్తిపోట్లకు ముందు ప్రాస్పర్, కత్రిలకు ఎలాంటి పరిచయం లేదన్నారు.అలాగే ద్వేషం, జాత్యహంకారంతో నేరం జరిగినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవని కేటర్ పేర్కొన్నారు.







