టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సెలెబ్రిటీలు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం పవిత్ర లోకేష్ (Pavitra Lokesh)నరేష్ (Naresh)జంట అని చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నటువంటి పవిత్ర లోకేష్ ఇద్దరు జంటగా మళ్లీ పెళ్లి (Malli Pelli) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై ఎన్నో అంచనాలను పెంచేసాయి.ఇకపోతే నరేష్ పవిత్ర ఇద్దరు కూడా జంటగా పలు సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర నటించినటువంటి అన్ని మంచి శకునములే (Anni Manchi Sakunamule) సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో హీరో సంతోష్ శోభన్ (Santosh Shoban) నటించిన ఈ సినిమా మే 18 వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు నరేష్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.
ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు పవిత్ర లోకేష్ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలను తెలియజేశారు.

ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ విక్టోరియాపురంలో జరిగిందని తెలిపారు.ఇక్కడికి లోకేషన్ గురించి నరేష్ వివరిస్తూ ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్‌లో షూటింగ్స్ పెట్టి, సరదాగా రిలాక్స్ అవ్వండని అప్పుడప్పుడు బ్రేక్‌లు ఇచ్చారు నిర్మాతలు.అయితే తనకు ఇక్కడ ఒక సొంత హౌస్ ఉందని నరేష్ తెలిపారు.
ఇక నాకోసం ప్రతిరోజు పవిత్ర (Pavitra) ప్రత్యేకంగా వంట చేసుకుని క్యారేజ్ తీసుకువచ్చేదని ఈ సినిమా షూటింగ్ సన్నివేశాల గురించి నరేష్ చెబుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదంతా ఒక ఫెంటాస్టిక్ సమయమని నరేష్ తెలిపారు.
కానీ ఒక ప్రొడ్యూసర్ గా ఇదంతా ఊహించుకుంటే చాలా భయం వేస్తుంది అంటూ ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా నరేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







