తాజాగా రాజస్థాన్ – బెంగుళూరు(Royal Challengers Bangalore , ) మధ్య జరిగిన మ్యాచ్ లో వార్ వన్ సైడ్ అయింది.ఫుల్ ఫామ్ లో బెంగళూరు జట్టు ఆకాశమే హద్దుగా చేరరేగింది.
ప్లే ఆఫ్ కు చేరాలంటే ఏ రీతిలో రాణించాలో ఈ మ్యాచ్ చూస్తే తెలుస్తుంది.బెంగళూరు జట్టు అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.బెంగళూరు జట్టు బ్యాటర్లైన డూప్లెసిస్ 55( Faf du Plessis ), గ్లెన్ మాక్స్ వెల్ 54 పరుగులతో అర్థ సెంచరీలు చేయడంతో బెంగుళూరు జట్టు స్కోరు 171 గా నిలిచింది.
ఇక విరాట్ కోహ్లీ 18, అనుజ్ రావత్ 29 (నాట్ అవుట్) పరుగులు చేశారు.మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.

172 పరుగుల లక్ష్య చేదన కు దిగిన రాజస్థాన్ జట్టు(Rajasthan Royals ) ఆరంభం నుంచే పేలవ ఆట ప్రదర్శన చేసింది.10.3 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది.హెట్ మేయర్ 35, జో రూట్ 10 పరుగులు చేయగా.
మిగిలిన రాజస్థాన్ బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరారు.దీంతో 112 పరుగుల తేడాతో బెంగుళూరు జట్టు విజయం సాధించి నెట్ రన్ రేట్ భారీగా పెంచుకుంది.
తద్వారా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి.

తాజాగా జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం వల్ల లీగ్ పాయింట్ల పట్టికలో బెంగుళూరు జట్టు ఐదవ స్థానానికి చేరింది.ఆడిన 12 మ్యాచ్లలో ఆరు మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లను సాధించింది.బెంగళూరు జట్టు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది.
హైదరాబాద్, గుజరాత్ జట్లతో తలపడాల్సి ఉంది.ఈ రెండు మ్యాచ్లలో గెలిస్తే బెంగుళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరినట్టే.
అలా కాకుండా ఒక మ్యాచ్లో గెలిచి మరొక మ్యాచ్లో ఓడితే.లక్నో జట్టు ఆడాల్సిన రెండు మ్యాచ్లు ఓడిపోవడం లేదంటే ముంబై జట్టు ఆడాల్సిన రెండు మ్యాచులు ఓడిపోతే అప్పుడు బెంగుళూరు జట్టుకు ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది.







