ఛత్రపతి మూడవ రోజు కలక్షన్స్ అంతేనా...?

టాలీవుడ్( Tollywood ) లో చాల మంది హీరోలు ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం యంగ్ హీరోలు మంచి సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు.తెలుగు లో టాప్ ప్రొడ్యూసర్ అయిన బెల్లం కొండ సురేష్ పెద్ద కొడుకు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda sai sreenivas ) ‘ఛత్రపతి’( Chatrapathi ) హిందీ రీమేక్ తో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Chatrapati's Third Day Collections Are All Details, Chatrapati Movie,bellamkonda-TeluguStop.com

‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా పాన్ ఇండియా చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.బెల్లంకొండ శ్రీనివాస్ ను తెలుగులో హీరోగా లాంచ్ చేసిన వి.

వి.వినాయక్ ( V V Vinayak ).హిందీలో కూడా హీరోగా లాంచ్ చేయడం జరిగింది…

 Chatrapati's Third Day Collections Are All Details, Chatrapati Movie,Bellamkonda-TeluguStop.com
Telugu Bellamkondasai, Chatrapathi, Chatrapati, Vinayak-Movie

టీజర్, ట్రైలర్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది.మే 12న ఈ మూవీ హిందీలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అయితే ప్రేక్షకుల నుండి ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం హిందీ వెర్షన్ ను రిలీజ్ చేశారు.

రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ తో పోల్చి హిందీ ‘ఛత్రపతి’ ని బాగా విమర్శించారు.అయినప్పటికీ నార్త్ లో మాస్ సెంటర్స్ లో ‘ఛత్రపతి’ కి మంచి టాక్ వచ్చింది.

Telugu Bellamkondasai, Chatrapathi, Chatrapati, Vinayak-Movie

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు చూసిన కొందరు మాస్ ఆడియన్స్ ‘ఛత్రపతి’ కి పాజిటివ్ టాక్ చెప్పారు.అయినా అక్కడ ఎక్కువ టికెట్లు తెగలేదు.తొలిరోజు ఈ చిత్రం అక్కడ మొత్తంగా రూ.94 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకుంది.నెట్ వచ్చేసరికి రూ.52 లక్షల వరకు ఉంటుందని అంచనా.అలాగే రెండో రోజు కూడా 55 లక్షల వరకు వసూళ్లను రాబట్టింది… ఇక మూడవ రోజు అయితే మరి దారుణం కలక్షన్స్ 50 లక్షలు మాత్రమే వచ్చింది…వీకెండ్స్ లో కలక్షన్స్ అలా ఉన్నాయి అంటే ఇక మిగితా రోజుల్లో కలక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి… ఇక ‘ఛత్రపతి’ ని పెన్ స్టూడియోస్ సంస్థ ఓన్ రిలీజ్ చేసుకుంది.నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే నిర్మాతలు సేఫ్ అయ్యారు.

సో థియేట్రికల్ పరంగా ఎంతొచ్చినా పర్వాలేదు.‘ది కేరళ స్టోరీ’ సినిమా అక్కడ ఫుల్ స్వింగ్ లో ఉండటం, ‘ఛత్రపతి’ ఒరిజినల్ వెర్షన్ ను నార్త్ జనాలు ఎక్కువగా చూసేయడం వంటి కారణాల వల్ల బెల్లంకొండ ‘ఛత్రపతి’ కి కలెక్షన్స్ రావడం లేదు అని స్పష్టమవుతుంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube