కర్ణాటక లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ ఆనందాన్ని దేశమంతా కాంగ్రెస్ శ్రేణులు పంచుకుంటూ, సంబరాలు చేసుకుంటున్నాయి.కేంద్ర అధికార పార్టీగా ఉన్న బిజెపి ఎన్ని కుయుక్తులు పన్నినా, కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించడం అషా మాషి వ్యవహారం కాదని కాంగ్రెస్ నమ్ముతోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి సీనియర్ నేత , మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తో పాటు , కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ల కష్టం చాలానే ఉంది.అయితే తెర వెనుక మాత్రం వీరిద్దరి కంటే ఎక్కువగా కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన వ్యక్తి పేరు ఇప్పుడు మారుమోగుతోంది.
ఆయనే కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యూహకర్తగా సునీల్ కానుగోలు( Sunil ) పనిచేస్తున్నారు.అంతేకాదు కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడుగాను కొనసాగుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ కు( Telangana Congress ) రాజకీయ వ్యూహాలు అందిస్తూ , రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిపించే బాధ్యతను సునీల్ తీసుకున్నారు.ఇక కర్ణాటకలో కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి , అధికారంలోకి రావడానికి సునీల్ కానుగోలు అనేక వ్యూహాలను అమ్లు చేశారు.కర్ణాటకలో 40% సర్కార్ అనే నినాదాలు వైరల్ అయ్యాయి.
పేసీఎం, పే సీఎం – క్రై పీఎం వంటి స్లోగన్లు హైలెట్ కావడం, అలాగే కాంగ్రెస్ పార్టీ స్కీములు ప్రజల్లోకి వెళ్లే విధంగా సునీల్ కానుగోలు అనేక వ్యూహాలు అమలు చేయడం వంటివి వర్కౌట్ అయ్యాయి.అంతేకాదు కర్ణాటక కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం పెంచే విధంగా అనే కార్యక్రమాలు చేపట్టడం , ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ పార్టీ నాయకులను సమన్వయం చేస్తూ, గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా వ్యవహరించడం వంటివి అన్నీ వర్కౌట్ అయ్యాయి.
తెర ముందు డీకే శివకుమార్ , సిద్దరామయ్య( Siddaramaiah ) పేర్లు వినిపిస్తున్నా.సునీల్ కానుగోలు కృషి చెప్పలేనిదని కాంగ్రెస్ అధిష్టానం కూడా అభిప్రాయ పడుతోంది.

సునీల్ వ్యూహాలతో తెలంగాణలోనూ కాంగ్రెస్ కు అధికారం దక్కుతుందని అంచన వేస్తోంది.గతంతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కు బలం పెరిగింది.అధికారంలోకి వస్తామనే ధీమా కనిపిస్తోంది.ఇదంతా సునీల్ కానుగోలు వ్యూహాల కారణంగానే అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.







