పెట్టుబడుల నిర్వహణ సంస్థ మ్యాన్ గ్రూప్ ( Man group )గురించి మీరు వినే వుంటారు.తాజాగా ఈ కంపెనీ ఓ అరుదైన ఫీట్ ని సొంతం చేసుకుంది.
ఈ కంపెనీ గత 240 ఏండ్ల చరిత్ర తీసుకుంటే ఇందులో మహిళా సీఈఓగా ఎవ్వరూ నియమితులు కాలేదు.అయితే తాజాగా ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది ఈ సంస్థ.
అవును, తాజాగా మొదటి సారిగా మహిళా సీఈవోగా ‘రాబిన్ గ్రూ’( Robin Grew )ను నియమించడం విశేషం.ప్రస్తుతం సీఈవోగా పనిచేస్తున్న ల్యూక్ ఎల్లిస్ సెప్టెంబర్ 1న పదవీ విరమణ చేయగానే రాబిన్ గ్రూ బాధ్యతలు చేపట్టనున్నారు.

లండన్( London ) కేంద్రంగా 1783 లో ప్రారంభమైన ఈ కంపెనీ 2వందల ఏండ్ల పాటు రాయల్ నేవీకి రమ్( Royal Navy Rum ), చక్కర ఉత్పత్తులను సరఫరా చేసింది.ప్రస్తుతం ఆర్థిక సేవల రంగంలో ఈ కంపెనీ కొనసాగుతుండడం విషయం తెలిసినదే.2010లో తొలిసారిగా మ్యాన్ గ్రూప్‌లో చేరిన ఎల్లిస్, సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు.ఇక ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న గ్రూ తన నియామకం తర్వాత బ్రిటన్‌కు మకాం మార్చనున్నారని తెలుస్తోంది.

144 బిలియన్ల డాలర్లు కంటే ఎక్కువ ఆస్తులను నిర్వహిస్తున్న ఈ కంపెనీ, దాని బోర్డు బాహ్య కార్యనిర్వాహక శోధన సంస్థ సహాయంతో ఎల్లిస్( Ellis ) పదవీ విరమణ నిర్ణయానికి ముందుగానే వారసుల శక్తి యుక్తులు గుర్తించి వారసత్వ ప్రణాళికలను అమలు చేయడంలో ప్రస్తుతం నిమగ్నమైపోయింది.ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎల్లిస్ తన వారసురాలైన గ్రూని తన వ్యాపారానికి తగినైన వారసురాలు అని అధికారికంగా ప్రకటించడం విశేషం.కాగా ఈ కార్యక్రమానికి మ్యాన్ గ్రూప్ తో సంబంధం వున్న మిత్ర వ్యాపారవేత్తలు హాజరైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.







