సీబీఐ నూతన డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్( Praveen Sood ) నియమితులయ్యారు.ప్రస్తుతం ఆయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు.2020లో కర్ణాటక డీజీపీ బాధ్యతలు చేపట్టారు.1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.ప్రధాని మోడీ నాయకత్వంలో హై పవర్ సెలక్షన్ కమిటీ ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్ గా ఎంపిక చేయడం జరిగింది.ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు.
జైస్వాల్ పదవీకాలం ముగిసిన వెంటనే ప్రవీణ్ సూద్… బాధ్యతలు అందుకుంటారని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించడం జరిగింది.ప్రవీణ్ సూద్ 1989 మైసూర్ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది.

అంతకుముందు ఐఐటి ఢిల్లీ విద్యాసంస్థల నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు.1999లో డిప్యూటేషన్ పై మారిషస్ దేశానికి పోలీస్ సలహాదారుగా మూడేళ్ల పాటు పనిచేశారు.2004-2007 మధ్యకాలంలో ప్రవీణ్ సూద్ మైసూర్ పోలీస్ కమిషనర్ గా వ్యవహరించారు.అనేక పురస్కారాలు, మెడల్స్ మరియు అవార్డులు కూడా అందుకోవటం జరిగింది.
కర్ణాటక( Karnataka ) డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ నీ సీబీఐ నూతన డైరెక్టర్ గా హై లెవెల్ కమిటీ సూచించింది.ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహ లోక్ సభలో ప్రతిపక్ష నేత…సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేయటం జరుగుద్ది.
ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా ఉన్న జైస్వాల్ పదవి కాలం మే 25న ముగియానుంది.ఆ తర్వాత జైస్వాల్ స్థానంలో ప్రవీణ్ సూద్ రానున్నారు.







