హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది.విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 1287.6 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు.పట్టుబడిన బంగారం విలువ రూ.67.96 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.కాగా అతను రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడిగా గుర్తించారు.







