తెలుగు లో మంచి మార్కెట్ ఉన్న హీరోలలో ఒకరు చియాన్ విక్రమ్.( Chiyaan Vikram ) అప్పట్లో ఈయన ఒక సంచలనం అనే చెప్పాలి.
తమిళం లో ఆ రోజుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హీరోగా విక్రమ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు అప్పట్లో.ఇక తెలుగు లో ‘శివ పుత్రుడు’ సినిమా ద్వారా మొట్టమొదటి సూపర్ హిట్ ని అందుకున్నాడు.ఆ తర్వాత కొన్నాళ్ళకు ‘అపరిచితుడు’ ( Aparichitudu ) అనే సినిమాతో ఏ రేంజ్ సెన్సేషన్ ని సృష్టించాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.‘అన్నియన్’ పేరుతో తమిళం లో డైరెక్టర్ శంకర్( Director Shankar ) తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు లో ‘అపరిచితుడు’ పేరుతో డబ్బింగ్ చేసారు.విడుదలైన కొత్తల్లో ఈ చిత్రాన్ని అసలు ఎవరూ పట్టించుకోలేదు.
వారం రోజుల పాటు థియేటర్స్ ఖాళీగా ఉండేవి.
కానీ చిన్నగా పాజిటివ్ టాక్ వ్యాప్తి చెందడం తో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం సృష్టించేసింది.తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
అప్పట్లోనే ఈ చిత్రం సుమారుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందట.ఇందులో విక్రమ్ కి జోడిగా సదా ( Sadha ) నటించింది.
ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ చూడడానికి ఎంతో చక్కగా అనిపించింది.అయితే కెమెరా ఆన్ లో లేనప్పుడు వీళ్లిద్దరు అన్నా చెల్లి అని పిలుచుకునేవారట.
డైరెక్టర్ శంకర్ ఇది గమనించి మీరిద్దరూ నా సినిమాలో హీరో హీరోయిన్లు, అన్నాచెల్లెళ్లు కాదు, మీరు ఆ ఉద్దేశ్యం తో ఉంటే నాకు ఆన్ స్క్రీన్ మీద మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ దెబ్బ తినే పరిస్థితి ఉంది.దయచేసి అలా ఉండొద్దు అని ఇద్దరికీ చెప్పాడట.కానీ ఒక్కసారి అలవాటు అయితే మానుకోవడం అనేది చాలా కష్టం.శంకర్ పదేపదే చెప్పినా వీళ్ళు సెట్స్ లో అన్నాచెల్లెళ్లు లాగానే ప్రవర్తించడం తో డైరెక్టర్ శంకర్ అసహనం కి గురై వీళ్ళ మీద కోపగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట.
ఇదంతా గతం లో సదా ‘అలీ తో సరదాగా’ ప్రోగ్రాం లో చెప్పుకొచ్చింది.ఇక ప్రస్తుతం సదా తనతో మొదటి సినిమా తెరకెక్కించిన తేజా దర్శకత్వం లో ‘అహింస’ అనే చిత్రం లో ముఖ్యపాత్ర పోషిస్తుంది.ఇందులో దగ్గుపాటి రానా సోదరుడు దగ్గుపాటి అభిరాం హీరో గా నటించాడు.వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఇక విక్రమ్ సంగతి అందరికీ తెలిసిందే, ఈయన సౌత్ లోనే టాప్ మోస్ట్ హీరో,
రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు.ప్రస్తుతం ఆయన PA రంజిత్ దర్శకత్వం లో ‘తంగాలాన్’ అనే చిత్రం లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఆయన లుక్స్ ఎంతో విభిన్నంగా ఉన్న సంగతి తెలిసిందే.అసలు నిజంగానే ఇతను విక్రమేనా అనే సందేహం కలగక తప్పదు.అంతలా ఆయన మేక్ ఓవర్ అయ్యాడు ఆయన.అయితే రీసెంట్ గానే ఒక రిస్కీ షాట్ చేసి తీవ్రమైన గాయాలపాలయ్యాడు, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది.