బుల్లితెర ఆర్టిస్ట్ రోహిణి( Rohini ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.నటిగా, జబర్దస్త్ లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.
అంతేకాకుండా వెబ్ సిరీస్ లో కూడా చేస్తూ తను టాలెంటును మరింత బయటపెడుతుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ బాగా సందడి చేస్తుంది.
అయితే తాజాగా ఈమె ఒక నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక ప్రమాదానికి గురైంది.అయితే ఆమె చేసిన నిర్లక్ష్యం ఏంటి.
ఆ ప్రమాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిణి మొదట్లో సీరియల్స్ లో నటించింది.అందులో తను నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్( Konchem Istam Konchem Kastam ) తో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఆ సీరియల్ లో తన పాత్రతో బాగా నవ్వించింది రోహిణి.
ఆ తర్వాత పలు సీరియల్ లలో అవకాశాలు కూడా అందుకుంది.మాటీవీలో శ్రీనివాస కళ్యాణం, ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ లో పోలీస్ పాత్రలో నటించింది.
సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని అందులో కూడా అడుగు పెట్టింది.
బిగ్ బాస్ తర్వాత రోహిణి జబర్దస్త్ లో బాగా బిజీగా మారింది.
లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి తన కామెడీతో బాగా నవ్విస్తుంది. జబర్దస్త్( Jabardasth ) లోనే కాకుండా ఇతర షో లలో కూడా బాగా సందడి చేస్తుంది.
వెండితెరపై కూడా పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంది.రీసెంట్ గా ద సేవ్ టైగర్స్ అనే సిరీస్ కూడా చేయగా అందులో తన పర్ఫామెన్స్ ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.అలా సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ సంపాదించుకుంది.యూట్యూబ్( YouTube ) లో కూడా తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో బాగా సందడి చేస్తుంది.చేసే ప్రతి అనిని వీడియో తీస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక వీడియో షేర్ చేసుకుంది.అయితే అందులో తనకు ఒక సర్జరీ చేశారు అని అనవసరంగా సర్జరీకి( Surgery ) వెళ్లాను అని చెప్పుకుంటూ బాధపడింది.అంటే ఐదేళ్ల కిందట తనకు యాక్సిడెంట్ జరిగిందని.దీంతో తన కాళ్లకు రాడ్ వేశారని తెలిపింది.అయితే ఇంతకాలం ఆ రాడ్ తీయడానికి తనకు టైం లేదు అని షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల తనకు రాడ్ తీయించుకోవడానికి అసలు టైం దొరకలేదు అని.దీంతో ఇప్పుడు కుదిరిందని తెలిపింది.
దాంతో హాస్పిటల్ కి వెళ్తే తన రాడ్ తీయడానికి కుదరలేదు అని.దానివల్ల సర్జరీ చేయటంతో ఇప్పుడు రెండు కాళ్లు బాగా నొప్పి పుడుతున్నాయని.అంతేకాకుండా చాలా డల్ గా ఉన్నాను అని.అనవసరంగా ఆపరేషన్ చేయించుకున్నాను అని తెలిపి బాధపడింది.అంటే గతంలోనే తను రాడ్ తీయించుకుంటే ఇంత ప్రాబ్లం ఉండకపోయేది అన్నట్లు తెలిపింది.







